iDreamPost
android-app
ios-app

Pawan, Pithapuram: ఓటమి వెతుక్కుంటూ పిఠాపురానికి పవన్..ఈ లెక్కలు తెలియవా?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు. ఇదే విషయం గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓటమిని వెతుక్కుంటూ పిఠాపురానికి వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు. ఇదే విషయం గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓటమిని వెతుక్కుంటూ పిఠాపురానికి వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Pawan, Pithapuram: ఓటమి వెతుక్కుంటూ పిఠాపురానికి పవన్..ఈ లెక్కలు తెలియవా?

ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడేకొద్ది పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కి చేరుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష కూటమి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక గురువారం ఏపీ రాజకీయల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన పిఠాంపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్వయంగా  ప్రకటించారు. అయితే భీమవరంలో ఓటమి భయంతోనే అక్కడి షిఫ్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఓటమిని వెతుక్కుంటూ పిఠాపురానికి పవన్ కల్యాణ్ వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు కొన్ని గణాకాలను కూడా చూపిస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లాలో అతి ముఖ్యమైన అసెంబ్లీ  స్థానాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. అలానే ఈ నియోజవర్గంలో కాపు ఓటర్లు అధికంగా ఉంటారు. దాదాపు 90వేలకుపైగా ఓటర్లు కాపులే ఉన్నారు. అందుకే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు సైతం ఈ సామాజికవర్గానికి చెందిన వారే ఉంటారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ భావించారు. గత కొన్ని రోజులుగా దీనిపై అనేక చర్చలు జరిగినా.. చివరకు అక్కడి నుంచే పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ కి గెలుపు చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి పిఠాపురం అసెంబ్లీ వివరాలు చూసినట్లు అయితే..

Pawan loose in pithaapuram

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి..ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సందర్భంలో చిరంజీవి 18 స్థానాల్లో విజయం సాధించారు. అలా ఉమ్మడి ఏపీలో పీఆర్పీ గెలిచిన స్థానాల్లో పిఠాపురం ఒక్కటి. ఇక్కడి నుంచి 2009లో వంగా గీతా విజయం సాధించారు. ఆ సమయంలో 46,623 ఓట్లు పొందింది. అలానే 31.19శాతం  ఓటు సొంతం చేసుకుంది. అప్పట్లో  టీడీపీ, కాంగ్రెస్ లు రెండు మూడు స్థానాలకు పరిమితమయ్యాయి.  ఆ సమయంలో కాపు సామాజికవర్గం ఓట్లు మొత్తం పీఆర్పీకి పడ్డాయి. ఇక 2014 ఎన్నిక విషయానికి వస్తే.. ఆ సమయానికి పీఆర్పీ లేదు. జనసేన పోటీకి దూరంగా ఉండి..టీడీపీకి మద్దతు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ రెండో స్థానంలో ఉండగా.. టీడీపీ డిపాజిట్ గల్లంతైంది.

2019 ఎన్నికల విషయానికి వస్తే.. ఇక్కడ  చాలా విచిత్రమైన రిజల్ట్ వచ్చింది. 2009లో పీఆర్పీని గెలిపించిన ఆ నియోజవర్గ ప్రజలు 2019 జనసేనను ఆదరించలేదు. అందుకు కారణం 2009 తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు. 2019 ఎన్నికల్లో పెండెం దొరబాబు వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 83,459 ఓట్లు పడ్డాయి. అలానే 44.71 శాతం ఓట్లను వైసీపీ సాధించింది. ఇదే సమయంలో రెండో స్థానంలో టీడీపీ, మూడో స్థానంలో జనసేన నిలబడింది.

Pawan loose in pithaapuram

ఈ ఎన్నికల్లో జనసేనాకు కేవలం 28 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలానే ఓటింగ్ శాతం 15 మాత్రమే జనసేన దక్కించుకుంది. మొత్తంగా 2009లో 31.19శాతం ఓట్లను సంపాందించి పీఆర్పీ,  2019లో జనసేనకు 15 శాతానికి పడిపోయింది. అంటే అక్కడి ఓటర్లలో పవన్ కల్యాణ్ ఫ్యామిలీపై  తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. 2009లో పీఆర్పీని గెలిపిస్తే.. ఆ తరువాత తమను పట్టించుకోలేదనే భావన అక్కడి ప్రజల్లో ఉందట. అలానే 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీ వంగా గీతా బరిలో ఉన్నారు. ఆమె గతంలో పీఆర్పీ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నియోజవర్గంలో వైఎస్సార్ సీపీ పార్టీ బలం, తన వ్యక్తిగత చరిష్మాతో వంగా గీతా గెలుపు అవకాశాల ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. అంతేకాక పవన్ కల్యాణ్, వంగాగీతా ఇద్దరు ఓకే సామాజికవర్గం వాళ్లు కావడం, పవన్ కుటుంబానికి 2009 నుంచి ఓటింగ్ శాతం తక్కువగా వస్తుండం..వైసీపీకి అనుకూలంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పిఠాపురం అసెంబ్లీ గణాంకాలు పరిశీలించినట్లు అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ ఓటమి తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇలా  పవన్ కల్యాణ్  ఓటమిని వెత్కుకుంటూ పిఠాపురానికి వెళ్లారనే పలువురు అభిప్రాయ పడుతున్నారు.