iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన పవన్ కల్యాణ్..! ఇక ఆ ఆశ వదులుకోవాల్సిందే..

ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన పవన్ కల్యాణ్..! ఇక ఆ ఆశ వదులుకోవాల్సిందే..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవల్మెంట్ స్కాంలో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ క్రమంలో గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేశ్.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. అయితే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. పవన్ ఇక జన్మలో సీఎం కాలేడని, సీఎం సీటు మీద ఆశలు వదుకోవాల్సిందేనా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చి.. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే ఈ మాటలతో ఆయన ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈరోజు చేసిన వ్యాఖ్యలతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయిందని తెలుస్తోంది.

దానికి కూడా కారణం లేక పోలేదు. పొత్తులతో ఎన్నికల్లోకి వెళ్తే.. టీడీపీ వాళ్లే సీఎం అభ్యర్థిగా ఉంటారని, పవన్ కి ఇచ్చే ఛాన్స్ లేదని తెలిసిందే. ఇప్పటి వరకు తమ అభిమాన నేతే సీఎం కావాలని జనసేన కార్యకర్తలు, అభిమానులు లోకల్ గా గట్టిగా పని చేస్తున్నారు. పొత్తు ఉన్నా లేకున్నా.. సీఎం అభ్యర్థి పవన్ కల్యాణే అంటూ ఆయన అభిమానులు తరచూ చెప్తున్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కూడా పవన్ కల్యాణ్ సీఎం అంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇలాంటి తరుణంలో గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు వారి ఆశలను అడియాశలు చేశాయి. ఇన్నాళ్లూ తన మీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో ఆయనను నమ్మిన వాళ్లకు ఈ రోజుతో భ్రమలు తొలిగించేశాడంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇలా టీడీపీకి సేవకుడిలాగా ఉంటానే తప్పా.. తాను సీఎం అయ్యే సామర్థ్యం లేదని పరోక్షంగా చెప్పాడని, అది అభిమానులు అర్థం చేసుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. 2024లో కనీసం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టమని పవన్ కల్యాణ్ కు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తుంటే.. అందుకు తగినట్లే.. తాను ఎమ్మెల్యే అయితే చాలని పవన్ అనుకుంటున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా దాదాపు పదేళ్ల నుంచి పవన్ సీఎం అవుతాడని ఆశలు పెట్టుకుని, 2024 ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆశలను పవన్ నీరు గార్చాడు. ఇక పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనే ఆశలను ఆయన అభిమానులు వదులుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆవేదన చెందినట్లు వస్తున్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి