Arjun Suravaram
Pawan Kalyan: బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించారు. ఈ పర్యటనలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మనీ పాలిటిక్స్ తెరలేపారు.
Pawan Kalyan: బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించారు. ఈ పర్యటనలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మనీ పాలిటిక్స్ తెరలేపారు.
Arjun Suravaram
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహా, ప్రతివ్యూహాలు రచిస్తోన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే…టీడీపీ, జనసేనలు కూటమిగా రానున్నాయి. ఇది ఇలా ఉంటే.. టీడీపీ, జనసేన పొత్తుల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ, ఇప్పటికే పవన్ కల్యాణ్ నాలుగు స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఇలా వీరి పొత్తు ఒకవైపు చిత్తుగా మారుతుంటే.. మరోవైపు తాజాగా పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాటలను విన్నవాళ్లు పవన్ కల్యాణ్ మనీ పాలిటిక్స్ తెరలేపారు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం భీమవరంలో పర్యటించిన పవన్ కల్యాణ్ అవసరమైతే ఓట్లు కొనండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసే ప్రసంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికార పార్టీ అవినీతికి పాల్పడుతుందని, ఓట్లను కొనుగోలు చేస్తుందంటూ అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయకపోవడంతోనే ఓడిపోయానంటూ, అయితే తాను ఎప్పుడు అలాంటి రాజకీయం చేయనంటూ తెగ భీరాలు పలికారు. అంతేకాక నన్ను రెండు చోట్ల ఓడించారంటూ అనేక సభల్లో ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండుస్థానాల్లో పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 2024లో కూడా మరోసారి భీమవరం నుంచే పోటీ చేస్తున్నట్లు కేడర్ కి సంకేతాలు ఇచ్చారు. ఈ సారి కూడా ఓడిపోతాననే భయం పవన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా భీమవరం పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
బుధవారం భీమవరంలో చేసిన పర్యటనలో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై ఆరోపణలు చేస్తూ.. తన అసలు ఆలోచనను బయట పెట్టారు. ఓట్లు కొనండి అంటూ నేతలకు పరోక్షంగా తెలిపారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..”ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. కనీసం భోజనాలకైనా డబ్బు ఖర్చు పెట్టకపోత ఎలా?. ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం. ఓట్లు కొనాలా లేదా అనే నిర్ణయం మీరే తీసుకోండి. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలని నేను ఎవరికీ చెప్పలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థి ఖర్చును 45 లక్షలకు పెంచింది. రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఓట్లు కొనాలా వద్దా అనేది నేను చెప్పను. వేలకోట్లు ఖర్చు పెట్టే వాళ్లు కూడా గప్ చుప్ గా కూర్చుంటున్నారు” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేన, టీడీపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేశాయి. తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. అంతేకాక ఓటమి భయంతో పవన్ మనీ పాలిటిక్స్ తెరలేపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.