iDreamPost
android-app
ios-app

చదువు చెప్పిన కాలేజీకి తెలుగు వ్యక్తి భారీ విరాళం.. ఏకంగా రూ.228 కోట్లు!

IIT Madras: కొందరు తాము చదువుకున్న పాఠశాల, తాము జన్మించిన ఊరి గురించి ఆలోచిస్తారు. అంతేకాక తమవంతుగా వేలు, లక్షలు విరాళం ఇస్తుంటారు. కానీ ఓ తెలుగు వ్యక్తి వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలను తాను చదువుకున్న కాలేజీకీ విరాళంగా ఇచ్చారు.

IIT Madras: కొందరు తాము చదువుకున్న పాఠశాల, తాము జన్మించిన ఊరి గురించి ఆలోచిస్తారు. అంతేకాక తమవంతుగా వేలు, లక్షలు విరాళం ఇస్తుంటారు. కానీ ఓ తెలుగు వ్యక్తి వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలను తాను చదువుకున్న కాలేజీకీ విరాళంగా ఇచ్చారు.

చదువు చెప్పిన కాలేజీకి తెలుగు వ్యక్తి భారీ విరాళం.. ఏకంగా  రూ.228 కోట్లు!

నేటికాలంలో ఎంతో మంది విజేతలుగా నిల్చి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే వాళ్లు గొప్ప స్థాయికి వెళ్లేందుకు ఎంతో కష్టపడి చదువుతారు. ఇలా రేయింబవళ్లు చదవుకుని ఉన్నత స్థితికి చేరి కోట్లు సంపాదిస్తుంటారు. అలాంటి వారిలో చాలా తక్కువ మందే తాము చదువుకున్న పాఠశాల, తమకు జన్మనిచ్చిన ఊరి గురించి ఆలోచిస్తారు. అంతేకాక తమవంతుగా వేలు, లక్షలు విరాళం ఇస్తుంటారు. కానీ ఓ తెలుగు వ్యక్తి వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలను తాను చదువుకున్న కాలేజీకి విరాళంగా ఇచ్చారు.  మొత్తం 228 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎవరు, ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన డాక్టర్ కృష్ణా చివుకుల ఓ మధ్యతరగతి కుటుంబం జన్మించారు. 1968లో ఐఐటీ బాంబే నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్ ఐఐటీ నుంచి 1970లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఆయన ఎంటెక్‌ పూర్తిచేశారు. అనంతరం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, కర్ణాటకలోని తుముకూర్‌ విశ్వవిద్యాలయం నుంచి  పీహెచ్‌డీ అందుకున్నారు. అంతేకాక ఇక, 37 ఏళ్ల వయసులోనే అమెరికాలోని ప్రముఖ హాఫ్‌మన్‌ సంస్థకు తొలి భారతీయ గ్రూప్‌ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

కొంతకాలం తరువాత న్యూయార్క్‌‌లో సొంతంగా ‘శివ టెక్నాలజీస్‌’ను  స్థాపించారు. భారత్‌లోని బెంగళూరులోనూ దీనిని ఏర్పాటుచేశారు. భారత్‌లో తొలిసారి 1997లో మెటల్‌ ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ (ఎంఐఎం) టెక్నాలజినీ పరిచయం చేసింది కృష్ణానే కావడం విశేషం. కొన్నేళ్ల తరువాత ‘ఇండో ఎంఐఎం’ సంస్థను ప్రారంభించిన ఆయన… తర్వాత ‘ఇండో యూఎస్‌ ఎంఐఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో మరో కంపెనీని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ ఏడాదికి టర్నోవర్‌ రూ.1000 కోట్లకు పైనే. ఇక, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) కింద ఐఐటీ మద్రాస్‌ విషయంలో ఆయన మంచి మనస్సు చాటుకున్నారు. 2020లో రూ.5.5 కోట్లతో ఐఐటీ మద్రాసులోని 60 ఏళ్ల నాటి వసతి గృహాలను ఆధునికీకరించారు.

2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో శాటిలైట్ తయారీకి రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్‌ చదివిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం  ప్రకటించారు. ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలు ఇచ్చే వ్యక్తులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపత్యంలో ఆగస్టు 6న జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా చివుకుల అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు. మొత్తంగా తాను చదివి కాలేజీ కోసం అలా  భారీగా విరాళం ఇచ్చి..దాతృత్వంలో కూడా  మేటి అనిపించుకున్నారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.