iDreamPost

రోజుకి రూ.2 కోట్లు సంపాదిస్తూ.. ఈ చందాల దందా దేనికి పవన్?

రోజుకి రూ.2 కోట్లు సంపాదిస్తూ.. ఈ చందాల దందా దేనికి పవన్?

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో కొన్ని జాతీయ పార్టీలు కాగా, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇక పార్టీలు నడవాలంటే.. ప్రధానంగా కావాల్సింది ఆర్థిక బలం. అందుకే పార్టీలకు వివిధ రూపాల్లో డబ్బులు అందుతుంటాయి. అలాంటి వాటిలో విరాళాలు కూడా ఒకటి.  అలానే రాజకీయ పార్టీకి విరాళాలు తీసుకోవడం సహజం. అలానే ఏపీలో కూడా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి పార్టీలకు కూడా విరాళలు వస్తుంటాయి. కానీ తాజాగా జనసేన పార్టీ  చేస్తున్న విరాళ సేకరణపై మాత్రం సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యూఆర్ కోడ్  పెట్టి మరీ.. విరాళాలు ఇవ్వమనడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రోజూ రూ.2 కోట్లు సంపాదిస్తూ ఈ చందాల దందా ఏంటి పవన్ అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జనసేన పార్టీ విరాళల కోసం ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. “వన్ డే శాలరీ ఫర్ జనసేన – మన పార్టీ, మన బాధ్యత” అంటూ ఆన్ లైన్ లో విరాళాలు ఆహ్వానిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ విరాళాలు సేకరిస్తున్నారు. రూ.10 మొదలు పెట్టి ఎంత పెద్ద మొత్తంలో అయినా ఈ విరాళాలు ఇవ్వొచ్చని  ఆ పార్టీ నేతలు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ విరాళలు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడకులకు సంబంధం లేదు. ఫోన్ పే, పేటీఎం ద్వారా పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా చందాలు ఇవ్వాలని  జనసేన నేతలు అడుగుతున్నారు. ఇక విరాళాలో భాగంగా రోజువారీ కూలిపనులు చేసుకునేవారి నుంచి రోజుకు రెండు కోట్లు సంపాదించేవారి వరకూ అందరూ ఒకరోజు జీతాన్ని జనసేన ఇవ్వాలని కోరారు.

జనసేన పార్టీ ముఖ్యనేతలు ఫోన్ పే, పేటీఎం ఏదైనా పర్లేదు కొట్టండి అని చెబుతుంటే…జనసేన అభిమానులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే పనికి పూనుకున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా జనసేన పార్టీకి విరాళం ఇచ్చే ముందు వివరాలు సరిచూసుకోండి అని కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. ఇది అంతా బాగానే ఉన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నాను అని చెప్పే పవన్ కళ్యాణ్.. ఈ చందాల దందా ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల క్రితమే  దర్శకుడు, డ్యాన్స్ రాఘవ లారెన్స్.. తనకు ఎవరు విరాళలు, చందాలు ఇవ్వొద్దని చెప్పిన సంగతి తెలిసిందే. తానూ సంపాదిస్తున్నానని వాటితోనే సేవ కార్యక్రమాలను చేస్తాని రాఘవ లారెన్స్ చెప్పారు.

అలాంటి ఓ మాములు నటుడే విరాళలు వద్దంటే.. రోజూ రూ.2 కోట్లు  సినిమాల ద్వారా సంపాదిస్తున్న పవన్ కల్యాణ్ మాత్రం విరాళం అడగడంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తాను విరాళలు అడుగుతూనే.. ప్రభుత్వం చేసే ఖర్చులపై వివరాలు తెలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఆయన సంపాదిస్తున్న డబ్బులు, తీసుకుంటున్నా ఈ విరాళ వివరాలు తెలియజేయండి పవన్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మీ కంటే చిన్న హీరో అయిన రాఘవ లారెన్స్ చూసి బుద్ధి మార్చుకొండి పవన్ అంటూ పలువురు ఫైర్ అవుతున్నారు. మరి.. జనసేన సేకరిస్తున్న విరాళంపై వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి