iDreamPost
android-app
ios-app

చంద్రబాబు అరెస్ట్ లో కీలక అప్ డేట్.. రాత్రంతా అక్కడే..!

చంద్రబాబు అరెస్ట్ లో కీలక అప్ డేట్.. రాత్రంతా అక్కడే..!

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమెన్స్ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు రూ.240 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అధికారులు విజయవాడ తరలించారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తరలించారు. అక్కడ దాదాపు నాలుగు గంటలకపు పైగా విచారణ కొనసాగుతూనే ఉంది. అదే అర్థరాత్రి దాటిన తరువాత చంద్రబాబును కోర్టు తీసుకెళ్తారని అందరు భావించారు. ఈక్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ లో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రాతంత్ర సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు ఉండనున్నట్లు తెలుస్తోంది.

శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబు నాయుడిని సిఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా విజయవాడ తరలించారు. మార్గం మధ్యలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేసిన..వారిని నివరిస్తూ పోలీసులు చంద్రబాబును విజయవాడకు తరలించారు. ఇక తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకెళ్లారు. అక్కడ ఎస్పీజీ ముందే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ముందుకు అధికారులు తయారు చేసుకున్న ప్రశ్నలు బాబు ముందు పెట్టారు.

దాదాపు ఐదు గంటల సమయం పాటు చంద్రబాబును అధికారులు విచారిస్తున్నారు. దాదాపు 20 ప్రశ్నలు చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలుస్తుంది.  అయితే సీఐడీకి చంద్రబాబు సహకరించడం లేదని తెలుస్తోంది. తాను కోర్టులోనే తేల్చుకుంటున్నాని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరు పర్చవచ్చని భావిస్తున్నారు. అలానే ఈ రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉంచి.. ఆదివారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరపర్చవచ్చునే వార్తలు వస్తున్నాయి.

అలానే ఒక వేళ కోర్టుకు తరలిస్తే విచారణ కోసం ఇరుపక్షాల లాయర్లు  సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ రాతంత్రా చంద్రబాబును సిట్ కార్యాలయంలోని ఉంచి ఆదివారం ఉదయం కోర్టు హాజరపర్చేలనే ఉద్దేశ్యంలో సీఐడి అధికారులు  ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబ కుటుంబ సభ్యులు కూడా సిట్ కార్యాలయంలోనే ఉన్నారు.  మరి.. చంద్రబాబును రాత్రంత్రా సిట్ కార్యాలయంలోనే  ఉంచుతారా? లేదా కోర్టుకు తరలిస్తారా  అనేది తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి