పెట్రోల్ పోయించిన వెంటనే మొరాయించిన బండి.. ట్యాంక్ లో చూడగా..!

ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల్లో కొంతమంది కస్టమర్లను మోసం చేయడం అనేది బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కల్తీ ఉన్న పెట్రోల్ ను వాహనాదరులకు అందించడం వంటి ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు, నీళ్లు వచ్చిన ఘటన సంచలనంగా మారింది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల్లో కొంతమంది కస్టమర్లను మోసం చేయడం అనేది బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కల్తీ ఉన్న పెట్రోల్ ను వాహనాదరులకు అందించడం వంటి ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు, నీళ్లు వచ్చిన ఘటన సంచలనంగా మారింది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మధ్య చాలామంది డబ్బు సంపాదించడం కోసం చేయని ప్రయాత్నాలు, దారుణలు అంటూ లేవు. ముఖ్యంగా ఎక్కడలేని అక్రమాలకైనా తెగబడుతున్నాడు. ఎందుకంటే.. తక్కువ సమయంలో ఈజీగా ఎక్కువ సంపాదించాలనే ఆశ పడుతున్నారు. అందుకోసం అవసరమైతే ఎదుటి వారిని కూడా మోసం చేయడంలో వెనుకడడం లేదు. కాగా, ప్రస్తుతం సమాజంలో నిత్యావసర సరుకులైనా పప్పులు, బియ్యం, నూనె, నీరు, పాలుతో సహా చివరికి వాహానాల్లో పోసే పెట్రోల్, డీజిల్ వరకు అన్నింటిలో కల్లీ చేయడం ఎక్కువైపోతుంది. అయితే రోజు రోజుకి ఇలాంటి దారులణాలు ఎక్కడపడితే అక్కడ వెలుగులోకి వస్తున్న విషయం తెలసిందే. ఈ క్రమంలోనే తాజాగా పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకి ఎక్కడంటే..

ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల్లో కొంతమంది కస్టమర్లను మోసం చేయడం అనేది బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కల్తీ ఉన్న పెట్రోల్ ను వాహనాదరులకు అందించడం, సరైనా మోతాదులో ప్రెటోల్ అందిచకపోవడం వంటి మోసాలు రాను రాను ఎక్కువైపోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ పెట్రోల్ బంకులో అయిన వాహనాల్లో పెట్రల్ పోయడం చూసి ఉంటాం. కానీ, పెట్రోల్ బదులు వాటర్  రావడం ఎక్కడైనా చూశారా?  అయితే తాజాగా  ఓ పెట్రోల్ బంకులో మాత్రం వాహనదారులు పెట్రోలు కొట్టించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు అన్నీ అగిపోయాయి. దాంతో ఏం జరిగిందో నని చెక్‌ చేసిన వాహనదారులు తమబైకులో ఉన్న పెట్రోల్‌లో వాటర్‌ను గుర్తించారు. వెంటనే వాహనాలతో పెట్రోలుబంక్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌ ఆంధ్రప్రభకాలనీలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో ఆదివారం ఉదయం పెట్రోల్‌తో పాటు నీళ్లు కూడా రావడంతో సంచలనంగా మారింది. కాగా, నిన్న ఉదయం వేళ పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులు కొద్ది దూరం వెళ్లగానే వారి బైకులు నిలిచిపోయాయి. దీంతో ముందుగా ఇద్దరు వాహనదారులు బంక్‌ వద్దకు తిరిగి రాగా.. వారికి పెట్రోల్ తోపాటు నీళ్లు కనిపించాయి. ఇక కొంతసేపటికి మరికొంత మంది బంక్‌వద్దకు తిరిగి వచ్చారు. ఇలా అక్కడ పెట్రోల్‌ పోయించుకుని, వాహనాలు ఆగిపోయిన వారు దాదాపు 30 మంది వెనక్కి తిరిగి వచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు వెంటనే పెట్రోల్ బంకు వద్దకు  చేరుకున్నారు.  అలాగే బంక్‌ యజమాని విచారించగా అతను స్పందించి బాధితుల వాహనాలను మరమ్మతులు చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇక అప్పటికపుడు మెకానిక్‌లను పిలిపించి, నీళ్లు కలిసిన పెట్రోల్‌ను ట్యాంకుల నుంచి తొలగించారు. ఇంజిన్‌లను శుభ్రం చేయించడంతో వ్యవహారం సద్దుమణిగింది. అయితే ఇలా పెట్రోల్ లో నీళ్లు కలిసిపోవడానికి కారణం.. పెట్రోల్‌ బంక్‌పై ఏర్పాటు చేసిన ఎయిర్‌ పైపు నుంచి వర్షం నీళ్లు పెట్రోల్‌ ట్యాంకులోకి చేరాయని అందువల్లే పెట్రోలులో నీళ్లు కలిశాయని, అది కేవలం పైపులో ఉన్నంతవరకే నీళ్లు కలిశాయని, బంకులో ఉన్న పెట్రోలులోకి నీరు చేరలేదని బంక్‌ యజమాని తెలిపారు. అంతేకాకుండా వెంటనే పైపును కూడా సరిచేశారు. మరి, పెట్రోల్ లో నీళ్లు కలవడం వాహనాలు ఆగిపోయిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments