iDreamPost
android-app
ios-app

లోకల్ బాయ్ నానిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు! కారణం ఏంటంటే!

  • Published Nov 20, 2023 | 8:29 PM Updated Updated Nov 20, 2023 | 8:29 PM

వైజాగ్ లోని ఫిపింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు కాలి బూడిదగా మారగా.. కోట్ల రూపాయల ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ నానిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

వైజాగ్ లోని ఫిపింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు కాలి బూడిదగా మారగా.. కోట్ల రూపాయల ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ నానిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

  • Published Nov 20, 2023 | 8:29 PMUpdated Nov 20, 2023 | 8:29 PM
లోకల్ బాయ్ నానిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు! కారణం ఏంటంటే!

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల 40 బోట్లలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఎలా జరిగిందో అనే విషయంపై స్పష్టత రాలేదు కానీ.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఓ పడవలో నుంచి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది మిగిలిన బోట్లకు అంటుంకుంది. అలా మొత్తం 40కుపైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ ఘటనలో యూట్యూబర్ నాని పేరు మాత్రం వినిపిస్తోంది.  ఈనేపథ్యంలోనే ఓ విషయంపై లోకల్ బాయ్ నానిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకవైపు అగ్నిప్రమాదంలో బోట్లు కాలిపోతుంటే.. మరోవైపు నాని వీడియో తీయడంతో నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు.

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసేంది. ఈ ప్రమాదంలో దాదాపు 60 బోట్ల వరకు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకా 60 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే.. ఈ అగ్ని ప్రమాదానికి కారకుడిగా భావిస్తోన్న యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని టాస్క్‌ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో ఈ ప్రమాదానికి లోకల్ బాయ్ నానీనే కారణమని.. సోషల్ మీడియాలో కూడా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆదివారం సాయంత్రం లోకల్ బాయ్ నాని రాత్రి సమయంలో తన స్నేహితులకు బోటులో మద్యం పార్టీ ఇచ్చారు. అయితే.. ఆ పార్టీ తర్వాతే ఈ అగ్ని ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఈ ప్రమాదాన్ని లోకల్ బాయ్ నాని.. మొత్తం వీడియో తీసి.. తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఆప్ లోడ్ కూడా చేశాడు. దీంతో.. ఇది సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇదే సమయంలో నానిపై నెటినజ్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఈ ప్రమాదానికి కారణం.. అతడా, కాదా? అనే విషయం పక్కన పెడితే..అతడు వీడియోలు తీయడంపై ఫైర్ అవుతున్నారు.  కొంచెమన్న తెలివి సిగ్గు ఉంటే బాగుండు అంతగా కాలి పోతుంటే ఏనుగుల ఉన్నావ్ ఏదైనా సహాయం చేయకుండా వీడియోలు తీస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయకపోగా  విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది దగ్గరకి వెళ్ళి వీడియో తిస్తున్నావు, నువ్వు కూడా అదే మంటల్లో పడి పోతే దరిద్రం పోయేదని నానిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

సమాజంలో ఫేమస్ అయిన వ్యక్తి.. నలుగురి ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలా వీడియోలు తీసి.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సహాయం చేయకుండా, తన లాగా వీడియోలు తీయండని యువతకు మేసేజ్ ఇస్తున్నాడా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకల్ బాయ్ నానిపై నెటిజన్లు ఫైర్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom