YSRCPకి నారా లోకేశ్ సాయం! ఇది అన్నిటికన్నా పెద్ద సెల్ఫ్ గోల్!

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం అధికార వైసీపీపై అనేక విమర్శలు చేస్తుంటారు. అయితే ఇలా లోకేశ్..వైసీపీపై విమర్శలు చేస్తూనే పెద్ద సాయం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు..

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం అధికార వైసీపీపై అనేక విమర్శలు చేస్తుంటారు. అయితే ఇలా లోకేశ్..వైసీపీపై విమర్శలు చేస్తూనే పెద్ద సాయం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు..

సాధారణంగా రాజకీయాలు అంటే ప్రత్యర్థిపై గెలిచేందుకు వ్యూహాలు రచించడం జరగుతుంది. అంతేకాక ప్రజల్లలోకి తమ ప్రత్యర్థికి సంబంధించిన వివిధ ప్రతికూల అంశాలను తీసుకెళ్తుంటారు. అలానే కొందరు నేతలు అయితే వివిధ రకాల ఆరోపణలు చేస్తుంటారు. ఇలా చేసే ఆరోపణలు కొన్నిసార్లు ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారుతుంటాయి. అంతేకాక తమ పార్టీకే డ్యామేజ్ జరిగి, ప్రత్యర్థి పార్టీకి సాయపడుతుంటాయి. తాజాగా మాజీ మంత్రి నారా లోకేశ్ చేస్తోన్న పనులు ఈ తరహాల్లోనే ఉన్నాయని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఆయన చేస్తున్న ప్రతిపని, ఆరోపణలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి.

అధికార వైఎస్సార్ సీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే వారిలో నారా లోకేశ్ ఒకరు. రాజకీయంగా లోకేశ్ ను ప్రమోట్ చేసేందు టీడీపీ నేతలు తెగ కష్టపడుతున్నారని టాక్. అలానే లోకేశ్ సైతం తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తరచూ ఏదో ఒక విమర్శ చేస్తుంటాడు. అయితే లోకేశ్ చేసే అసత్య ఆరోపణలతో చివరకు నవ్వుల పాలవుతుంటాడు.

అలానే ఏపీ పొలిటికల్ నేపథ్యంలోనే తెరకెక్కి సినిమాల విషయంలోనూ లోకేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసి..వైసీపీ ప్రతికూలంగా మార్చాడు. ఇటీవలే విడుదల యాత్ర-2 సినిమా థియేటర్లలో మంచి టాక్ తో దూసుకెళ్తోంది. దీనికి కారణం లోకేశ్ అని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. కారణం..రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా యాత్ర సినిమా కంటే ముందు రావాల్సింది. అయితే ఆ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నారా లోకేశ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆ సినిమా విడుదలకి కాస్తా బ్రేక్ పడింది. ఇదే సమయంలో యాత్ర-2సినిమా రావడం..ప్రేక్షకుల్లో ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం జరిగింది.

అదే లోకేశ్.. వ్యూహం సినిమాపై  కోర్టులో పిటిషన్ వేయకుండా ఉంటే..యాత్ర సినిమ టైమ్ లోనే విడుదల జరిగేది. అలా జరిగి ఉంటే.. రెండు సినిమాలు ఒక్కేసారి రావడంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించే వారు కాదు. అలానే రెండు సినిమాల మధ్య క్రాష్ ఏర్పడేది. కానీ లోకేశ్ చేసిన పని వలన యాత్ర-2 మంచి విజయం సాధించింది. ప్రజల్లోకి సీఎం జగన్ పై మరింత సానుకూలత వచ్చేలా చేసింది. వ్యూహం సినిమా మార్చి 1న విడుదల కానుంది. అంటే సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలా పరోక్షంగా లోకేశ్..వైసీపీ సాయ పడ్డారు.

అలానే గతంలో మద్యం విషయంలో సీఎం జగన్ పై లోకేశ్ అనేక అసత్య ఆరోపణలు చేశారు. బూమ్ బూమ్ వంటి కొత్త బ్రాండ్ లను జగన్ సర్కార్ తీసుకొచ్చిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన వైసీపీ..అసలు ఆ బ్రాండ్ లను ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వమే అని ఆధారాలతో సహా నిరూపించింది. అలానే ప్రజలపై చెత్త పన్ను భారం వేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని తొలుత అమలు చేసింది ఏపీ రాష్ట్రమని, అమలు చేసిన టైమ్ లో ఉంది టీడీపీ ప్రభుత్వమని వైసీపీ నేతలు నిరూపించారు. ఇలా లోకేశ్ ఏదో విధంగా వైసీపీని విరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తూ..పరోక్షంగా వైసీపీకి పెద్ద సాయం చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. అసలు ఈ అంశాలపై,సినిమాల విషయంలో లోకేశ్ స్పందించకుండా ఉంటే… పరిస్థితులు వేరేలా ఉండేవి కదా అంటూ అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఇలా లోకేశ్ వైసీపీకి పరోక్షంగా సాయం అందిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments