iDreamPost
android-app
ios-app

జైల్లో ఉన్న చంద్రబాబు తీరు మారదా?.. వైసీపీ నేతల కామెంట్స్!

నారా చంద్రబాబు నాయుడి రాజకీయాల్లో  ఉండే తీరు అందరికి తెలిసిందే. కుట్రలు, కుంత్రాలు,అబ్దపు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. తాజాగా లేఖ వ్యవహారంలో జైల్లో ఉన్నా చంద్రబాబు తీరు మారదా అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

నారా చంద్రబాబు నాయుడి రాజకీయాల్లో  ఉండే తీరు అందరికి తెలిసిందే. కుట్రలు, కుంత్రాలు,అబ్దపు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. తాజాగా లేఖ వ్యవహారంలో జైల్లో ఉన్నా చంద్రబాబు తీరు మారదా అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

జైల్లో ఉన్న చంద్రబాబు తీరు మారదా?.. వైసీపీ నేతల కామెంట్స్!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్టుతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. దసరాకు నిజం గెలవాలి పేరుతో మరో కార్యక్రమం చేయనున్నారు. ఇక ఈ అంశాలు పక్కన పెడితే చంద్రబాబు రాజకీయాల్లో  ఉండే తీరు అందరికి తెలిసిందే. కుట్రలు, కుంత్రాలు,అబ్దపు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లోఅడ్డంగా దొరికిపోయిన బాబు అండ్ టీమ్.. తాజాగా లేఖ రూపంలో మరోసారి పట్టుబడ్డారు. దీంతో జైల్లో ఉన్నా చంద్రబాబు తీరు మారదా అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్మంట్ స్కాంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాబు రాసినట్లు టీడీపీ నేతలు ఓ లేఖను విడుదల చేశారు. జైలు అధికారులు స్పందించి… ఆ లేఖకు తమకు సంబంధం లేదని..జైలు నుంచి ఆ లేఖ రాలేదని స్పష్టం చేశారు. దీంతో వెంటనే టీడీపీ నేతలు మాట మార్చి.. బాబు ములాఖత్ కి వెళ్లినప్పుడు చెప్పారని తెలిపారు. దీంతో మరోసారి చంద్రబాబు బుద్ధి, టీడీపీ నేతల దొంగనాటకలు బయట పడ్డాయని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసాలు, కుట్రలు, అసత్యాలతోనే సాగిందని వైసీపీ నేతలతో సహా పలువురు ఇతర పార్టీలకు చెందిన వారు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కోవడంతో ప్రారంభమై.. తోడల్లుడిని, హరికృష్ణను నమ్మించి చంద్రబాబు మోసం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు  ఎన్నో సందర్భాల్లో తెలిపారు. ఇటీవల సైతం టీడీపీ దొంగనాటకలు బయట పడ్డ సంగతి తెలిసిందే. అంతేకాక ఎంతో మందిని రాజకీయంగా మోసం చేశారని ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం డబ్బులు ఇవ్వజూపి.. బ్రీఫ్డ్ మీ అంటూ వాయిస్ తో బాబు అడ్డంగా దొరికిపోయారు.

జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆయన బరువు తగ్గారంటూ అసత్యపు వార్తలు ప్రచారం చేశారు. దీంతో వెంటనే స్పందించిన జైలు అధికారులు బాబు జైల్లో 1 కేజీ పెరిగారని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ దొంగ నాటకం బయట పడిందని వైసీపీ నేతలు విరుచకపడ్డారు. తాజాగా చంద్రబాబు లేఖ అంటూ ఆదివారం విడుదల చేశారు. తీరా జైలు అధికారులు స్పందించాకా.. తూచ్.. చంద్రబాబు చెప్పి… తన పేరున లేఖ విడుదల చేయమన్నారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.

దీంతో  ఇలాంటి కుట్రలు, కుట్టిల రాజకీయాలు చేయడంలో బాబు దిట్ట అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అవినీతి కేసులో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లిన కూడా చంద్రబాబు బుద్ది, టీడీపీ తీరు మారలేదంటూ ప్రత్యర్థి పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. మరి.. జైల్లో ఉన్న చంద్రబాబు బుద్ది మారలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్నవ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş