P Krishna
Vizag MRO Murder Case: సినిమాల్లో నటించాలనే తపనతో ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు.. సొంతంగా వెబ్ సీరీస్ తీసి విలన్ గా నటించాడు.. చివరికి జీవితంలోనూ విలన్ గా మారాడు.
Vizag MRO Murder Case: సినిమాల్లో నటించాలనే తపనతో ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు.. సొంతంగా వెబ్ సీరీస్ తీసి విలన్ గా నటించాడు.. చివరికి జీవితంలోనూ విలన్ గా మారాడు.
P Krishna
సినీ ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం అంటారు. వెండితెరపై ఒక్కసారి కనిపించినా సెలబ్రెటీ హూదా లభిస్తుందని చాలామంది భావిస్తుంటారు. అందుకే ఒక్క ఛాన్సు ఇవ్వండి అంటూ స్టూడియోలు, దర్శక, నిర్మాతల చుట్టూ తిరుగుతుంటారు. అదృష్టం కలిసి వస్తే ఛాన్స్ దొరుకుతుంది.. రాని వారు ఛాన్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇటీవల తమ టాలెంట్ చూపించుకోవడానికి రీల్స్, యూట్యూబ్ ఇతర సోషల్ మాధ్యమాలు వస్తున్నాయి. సినిమాల్లో నటించాలనే కోరికతో ఎన్నోరకాలుగా ప్రయత్నించాడు.. చివరికి తానే ఓ వెబ్ సీరీస్ తెరకెక్కించి అందులో విలన్ గా నటించాడు.. జీవితంలో కూడా విలన్ గా మారాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? పూర్తి వివరాలు మీకోసం..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన ఎమ్మార్వో రమణయ్య మర్డర్ మిస్టరీ వీడిపోయింది. హత్యకు గల కారణం భూ వ్యవహారాలు, వ్యక్తిత లావాదేవీలని తేలింది. హత్య చేసి విశాఖ నుంచి చెన్నైకి పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమీషనర్ డాక్టర్ ఎ రవిశంకర్ తెలిపారు. రమణయ్యను హత్యచేసిన హంతకుడు మురారి చీకటి జీవితంలోని కొన్ని సంచలన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మురారిపై రూ.2.50 కోట్ల మేర మోసం చేసినట్లు హైదరాబాద్, విజయవాడ పరిధిలో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. సినిమాపై మోజుతో మూడేళ్ల క్రితం ‘ది నైట్’ పేరుతో రెండు ఎపిసోడ్ల వెబ్ సీరీస్ తీశాడు. దీనికి రూ.40 లక్షలకు పైగా ఖర్చు అయ్యింది.. దర్శకుడికి డబ్బు చెల్లించకపోవడంతో తానే దర్శకత్వం వహించి రెండు ఎపిసోడ్లు పూర్తి చేశాడు. ఇందులో మురారి విలన్ గా నటించాడు.
ఈ వెబ్ సీరీస్ ఎక్కువ వైలెన్స్ ఉండటంతో ఓటీటీలో రిలీజ్ కి అభ్యంతరాలు వచ్చాయి. తర్వాత వెబ్ సీరీస్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో మోసానికి పాల్పపడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వెబ్ సీరీస్ లో విలన్ ఓ యువతిని రాడ్డుతో తలపై బలంగా కొడతాడు.. ట్రైలర్స్ లో ఇదే సన్నివేశాన్ని పదే పదే చూపించారు. అచ్చం అలాగే నిజ జీవితంలో కూడా తహసీల్దార్ రమణయ్యను కూడా ఇనుపరాడ్ తో తలపై కొట్టి హత్య చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. విశాఖలో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్ గా మురారి జాబ్ చేస్తున్నాడు. న్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే రమణయ్యను హత్య చేసినట్లు మురారి ఒప్పుకున్నట్లు సమాచారం. మురారిపై హత్య కేసు నమోదు చేసి.. భీమిలి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి రీల్ జీవితంలోనే కాదు.. రియల్ జీవితంలోనూ విలన్ అవతారం ఎత్తిన మురారి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.