iDreamPost
android-app
ios-app

తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీ.. విజయసాయి రెడ్డి సెటైర్!

తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీ.. విజయసాయి రెడ్డి సెటైర్!

ప్రస్తుతం ఏపీలోని రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ఈ పొలిటకల్ హీట్ దెబ్బకు వానలు పడ్డ కూడా ఏపీ చల్లబడటం లేదు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్, ఆ తరువాత జరుగుతున్న పరిణామాలు ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి కేసులపై  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా లోకేశ్ పేరును చేర్చడంతో, త్వరలో ఆయన కూడా జైలుకు వెళ్తాడంటూ వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అయితే తనదైన శైలీలో సెటైర్లు వేస్తుంటారు. తాజాగా  చంద్రబాబు, లోకేశ్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టై  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబును జైలు నుంచి బెయిల్ పై తీసుకొచ్చేందుకు ఆయన తరపు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. దీంతో లోకేశ్ కూడా జైలుకు వెళ్తారంటూ వైసీపీ నేతలు, మంత్రులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ రెండు అంశాలను ప్రస్తావిస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. తండ్రీకొడుకుల ఆట ముగిసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘తండ్రి ఎలాగో… కుమారుడు అలాగే! ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేష్ A-14గా చేరారు. ఇప్పుడు లోకేష్ ఢిల్లీలో లాయర్లకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఇవ్వాలి” అంటూ పోస్ట్ చేశారు.

ఎవరైనా తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీగా పొందవచ్చుని, వారిద్దరి పని ముగిసిందిని విజయసాయి ఎక్క్ వేదికగా ట్వీట్ చేశారు. రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తి కట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు. ఇలా చేయడం వాళ్లకు కొత్తేం కాదని, డబ్బు వెదజల్లితే ఏ పనైనా జరిగిపోతుందని నేటికి.. ఏనాటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ. ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయని విజయసాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. మరి.. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.