Arjun Suravaram
Arjun Suravaram
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు టీడీపీ శ్రేణులు చేస్తున్న ఓవరాక్షన్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పబ్లిక్ ను ఇబ్బందులకు గురి చేసేలా వారు నిరసనలు చేస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. తాజాగా ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తాడికొండ ఎమ్మెల్యే కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. అయితే ఆమె మెట్రో నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో కొందరు ఈ రోజు ఉదయం లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఐటీ ఉద్యోగులు నల్ల టీ షర్టులు ధరించి మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణించేందుకు రోడ్లపై వచ్చారు. అలానే మెట్రో రైల్లో వారు చేసిన ఓవరాక్షన్ కి తోటి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిరసనలు చేసుకోండి అంటూ టీడీపీ సానుభూతిపరులపై మండిపడ్డారు. ఇదిలావుంటే, వైసీపీ రెబల్, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా వచ్చి రాచకొండ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలిపారు.
అంతేకాక ఆమె కూడా మెట్రో స్టేషన్ లోకి వెళ్లి జై సీబీఎన్ అంటూ గట్టిగా కేకలు వేశారు. శ్రీదేవితో పాటు ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను రోడ్డుపైనా నడవకూడదని, వెంటనే వెళ్లి పోవాలని ఆదేశించారు. మెట్రో నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేసి రాచకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. ఏపీలోనే అరాచక పాలన సాగుతోందని అనుకున్నామని.. కానీ, తెలంగాణలోనూ అదే తరహా పాలన సాగుతోందన్న విషయం పోలీసుల ప్రవర్తనను చూస్తే స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటమ్మ నీ ఓవరాక్షన్ అంటూ ఉండవల్లి శ్రీదేవిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.