iDreamPost

ఆ 10 నియోజకవర్గాలపై CM జగన్ స్పెషల్ ఫోకస్!

ఆ 10 నియోజకవర్గాలపై CM జగన్ స్పెషల్ ఫోకస్!

ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్లకు కాస్త సమయం ఉన్నప్పటికి ఇప్పటికే అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. అయితే మిగిలిన పార్టీల కంటే అధికార వైసీపీ ఎన్నికల సమరంలోకి కాస్త ముందే దిగింది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా వైసీపీకే అనుకూల ఉందనే బహిరంగ రహస్యమే. ఇలా వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమైనప్పటికీ  ఓ పది నియోజకవర్గాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

2024లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకి 175 గెలిచే విధంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అందుకే  తరచూ సభలు నిర్వహిస్తూ.. తమ పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి  బలంగా తీసుకెళ్తున్నారు. అలానే పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం కూడా చేస్తున్నారు. ఇక క్షేత్ర స్థాయిలో కూడా వైసీపీకి అనుకూల పవనాలే వీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ చాలా వీక్ కావడం, అదే సమయంలో వైసీపీ స్ట్రాంగ్ కావడం అనుకూలంగా ఉంది. 175 స్థానాల్లో విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నప్పటికీ సీఎం జగన్ ఓ పది నియోకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.

2019 ఎన్నికల్లో జగన్ సునామీ ఓ రేంజ్ లో  వచ్చిందో అందరికి తెలిసిందే. ఆ సునామీకి టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.  ఇలా ఫ్యాన్ గాలిని తట్టుకుని కొన్ని నియోజకవర్గాలో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ సారీ ఆ నియోజకవర్గాల్లో కూడా వైసీపీనే గెలుస్తుందనే వార్తలు వినిపిస్తోన్నాయి. అయినప్పటికే ఆ నియోజవర్గాలపై సీఎం జగన్ కాస్తా ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సీఎం జగన్ ఫోకస్ పెట్టిన నియోజవర్గాల్లో మొట్ట మొదటిది కుప్పం. ఇది ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన కుప్పంలో వైసీపీ జెండా ఎగరెయాలని అధిష్టానం భావిస్తుంది.

అలానే హిందూపురం నియోజవర్గంపై కూడా వైసీపీ ఫోకస్ చేసింది. ఇది గతకొన్నేళ్ల నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇప్పటికే రెండు పర్యాయాలు నందమూరి బాలకృష్ణ గెలిచారు. ఈసారి ఎలాగైన అక్కడ కూడా వైసీపి జెండ ఎగిరేలా చేయాలని అధిష్టానం భావిస్తుంది. అందుకే కుప్పం, హిందూపురం నియోజకవర్గాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.ఇక ప్రకాశం జిల్లాలో అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ సునామీలో నిలబడినది ఈ రెండు నియోజకవర్గాలే. మిగిలిన స్థానాలతో పాటు ఈ రెండు స్థానాలపై కూడా వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసింది.

కృష్ణా జిల్లాలో వైసీపీ మోజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికి గన్నవరంలో మాత్రం టీడీపీ గెలిచింది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ కి రావడం జరిగింది. దీంతో గన్నవరంలో వైసీపీ విజయం సునాయాసమే. అయినప్పటికే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి టీడీపీ వెళ్లాడు. ఈక్రమంలోనే గన్నవరంలో వైసీపీ విజయం కీలకంగా మారింది. అందుకే వైసీపీ ఫోకస్ పెట్టిన నియోజకవర్గాలో గన్నవరం కూడా ఉంది. అలానే టెక్కలిలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. టెక్కలిలో క్షేత్ర స్థాయిలో కూడా వైసీపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈసారీ ఎలాగైన టెక్కలిలో వైసీపీ విజయం సాధించాలని పట్టుదలగా అధిష్టానం ఉంది.

అలానే మాజీ హోంమంత్రి చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురం తో పాటు మండపేట కూడా సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇక విశాఖపట్నంలో మాజీ మంత్రి శ్రీనివాసరావుకు చెక్ పెట్టేలా వైసీపీ అధిష్టానం పావులు కదుపుతుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో నాలుగు స్థానాలు టీడీపీ గెలిచింది. ఈ సారీ ఎలాగైనా ఆ నాలుగు స్థానాలు వైసీపీ గెలిచేలా అష్టానం ప్రణాళిక రచిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి  గణేష్ వంటి ఇతర ముఖ్యనేతలు ఆ నాలుగు నియోజకవర్గాల నుంచి వైసీపీలో చేరారు. దీంతో వైసీపీకి మరింత బలం చేరుకూరినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ సీఎం జగన్ ఈ 10 స్థానాలపై మాత్రం కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి