Dharani
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. రాష్ట్రంలోని కొందరు రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. రాష్ట్రంలోని కొందరు రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుంది. ఆ వివరాలు..
Dharani
సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. అర్హులైన రైతులకు లక్ష రూపాయల వరకు రుణం మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణాల మంజూరు విషయంలో బ్యాంకులు లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలానే గృహ నిర్మాణానికి, విద్యా రంగానికి కూడా రుణాలు మంజూరు చేయాలని మంత్రి బుగ్గన కోరారు.
ఏపీలో కౌలు రైతుల రుణాల మంజూరుకు సంబంధించి రాష్ట్రం ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ(రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ) సమావేశంలో చర్చించింది. రాష్ట్రంలో 2023-24కు 3 లక్షల మంది కౌలురైతులకు రుణాలు అందించాలనే లక్ష్యంగా ఉండగా.. గత సెప్టెంబరు వరకు 75 వేల మందికే బ్యాంకులు రుణాలు అందించాయి అని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యంలో కేవలం 25 శాతమే సాధించామని తెలిపారు. అంతేకాక ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు స్వల్పకాలిక పంట రుణాల కింద రూ.1.48 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఖరీఫ్‌లో 56 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలోని బ్యాంకులు రైతులకు రూ.లక్ష నుంచి రూ.లక్షా 60 వేల వరకు రుణాలు అందిస్తున్నాయి.
ఈసందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, కౌలు రైతులకు రుణాల మంజూరులో బ్యాంకులు లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలానే తమ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఈ ఏడాది 3 లక్షల మందికి పైగా కౌలురైతులకు రూ.4 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుందని తెలిపారు. అయితే ఇప్పటివరకు 75 వేల మందికి పైగా రుణాలు అందించాయని.. వీరికి మరింత తోడ్పాటును అందించాలని బుగ్గన కోరారు. అలానే టిడ్కో గృహాలకు రుణాలు అందించాలని.. విద్యారుణాల మంజూరులోనూ ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
విద్య, వైద్యరంగాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి బ్యాంకులు తోడ్పాటును అందిస్తాయని యూబీఐ ఈడీ నితీష్ రంజన్ తెలిపారు. వ్యవసాయరంగానికి స్వల్పకాలిక పంటరుణాల కింద ఖరీఫ్, రబీ కలిపి రూ.1.48 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఖరీఫ్‌లో రూ.82,329 కోట్లు అందించి 56 శాతం మేర లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2023-24 బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక మేరకు రుణాల మంజూరులో గత సెప్టెంబరు వరకు సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.