Buggana About Skill Developement Scam: స్కిల్ డెవలప్మెంట్‌లో మోసం.. సాక్ష్యాలతో బయట పెట్టిన బుగ్గన !

స్కిల్ డెవలప్మెంట్‌లో మోసం.. సాక్ష్యాలతో బయట పెట్టిన బుగ్గన !

స్కిల్ డెవలప్మెంట్‌లో మోసం.. సాక్ష్యాలతో బయట పెట్టిన బుగ్గన !

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు స్కిల్ డెవలప్మెంట్ స్కాం. కారణం.. ఈ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడమే. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో  ఎప్పుడూ జైలు గడప తొక్కని చంద్రబాబు ఈ స్కిల్ స్కాంలో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  పేరుతో దాదాపు రూ. 240 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని సీఐడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ స్కిల్ స్కాం కేసు కోర్టులో నడుస్తోంది. ఇలాంటి తరణంలో బాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో భారీ  మోసం వెలుగులోకి వచ్చింది. స్వయంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గననే  మోసాన్ని వెల్లడించారు.

టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. సిమెన్స్ అనే సంస్థ భాగస్వామ్యంతో 90:10 నిష్పత్రిలో ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. సదరు సంస్థ ఒక్క రూపాయి కూడా ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడి  సర్కార్ రూ.371 కోట్లను విడుదల చేసింది. ఇందులో రూ.240 కోట్లు పక్కదారి పట్టినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ను ముందుగానే విదేశాలకు పంపినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్కిల్ స్కాం కేసులో సీఐడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. కీలక అంశాలను చంద్రాబాబు నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు సీఐడీ అధికారులు.

ఇలాంటి తరుణంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంశం చర్చకు వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట పెట్టిన సాక్ష్యాలు సంచలన సృష్టిస్తోన్నాయి. ఇప్పటికే రూ.3300 కోట్లు ఇచ్చారంటూ కథలు అల్లుతున్న వ్యవహారం, 240 కోట్లు దారిమళ్లాయని ఈడీ చెప్పడం వంటివి ఒకెత్తు అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తుగా నిలిచాయి.  ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కనీసం 3 నెలలు ఇవ్వాల్సి ఉంటే, కేవలం 5 రోజుల్లోనే ట్రైనింగ్ పూర్తి చేశారు. ఇలా యువతకు ఇచ్చామంటే, ఇచ్చామనట్లు స్కిల్ డెవలప్మెంట్ ను టీడీపీ ప్రభుత్వం నడిపించిందంట.

ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీలో మంత్రి బుగ్గన సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. కొందరు 12 తేదీని జాయిన్ అయితే.. 17వ తేదీ కల్లా కోర్సు పూర్తైనట్లు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఉందని బుగ్గన తెలిపారు. ఈ విధంగా అయితే 2 లక్షల మందికి ఏంటి.. ఐదు రోజుల ట్రైనింగ్ తో 50 లక్షల మందికి కూడా ఇవ్వొచ్చని, ఇలా ట్రైనింగ్ ఇవ్వండం వలన  ఏంటి ప్రయోజనం అనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పేరుకే ల్యాబ్ లు, గదులు అంటూ డ్రామాలు ఆడి.. ఇచ్చామంటే ఇచ్చాము చూపించి.. ఫైనల్ గా  ఏమి చేయలేదనే విషయాన్ని బుగ్గన వెల్లడించారు. మరి… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మంత్రి బుగ్గన బయట పెట్టిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments