iDreamPost
android-app
ios-app

అంగన్ వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది: మంత్రి బొత్స

అంగన్ వాడీ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. అంగన్ వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స వెల్లడించారు. ఇప్పటికే పలు డిమాండ్లను నెరవేర్చామన్నారు.

అంగన్ వాడీ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. అంగన్ వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స వెల్లడించారు. ఇప్పటికే పలు డిమాండ్లను నెరవేర్చామన్నారు.

అంగన్ వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్ వాడీలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అంగన్ వాడీ వర్కర్ లు, హెల్పర్ లు ఆందోళనలు చేపడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని జీతాల పెంపుదలతో పాటు గ్రాట్యూటీ అమలు చేయాలని అంగన్ వాడీ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయితే ఇప్పటికే కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని మరికొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని అంగన్ వాడీ వర్కర్ల సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి.ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అంగన్ వాడీ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చర్చలు జరిపారు. కాగా అంగన్ వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి.

అంగన్ వాడీ సంఘాలతో సమావేశం అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ.. మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. వేతనాల పెంపుకు కొంత సమయం కావాలని కోరాం అన్నారు. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిద్దామని సూచించామని తెలిపారు. మావిజ్ఞప్తుల పట్ల అంగన్ వాడీలు సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. అంగన్ వాడీలు లేవనెత్తిన పలు డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమ్మెతో బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరామన్నారు. జనవరి 3 తర్వాత బాలింతలకు జగనన్న కిట్లు అందించాలన్నారు. అంగన్ వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గ్రాట్యూటీ అంశం ప్రభుత్వ పరిధిలో లేదని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని సూచించామని బొత్స వెల్లడించారు. వెంటనే సమ్మెను విరమించి అంగన్ వాడీలు విధులకు హాజరవ్వవాలని మంత్రి బొత్స కోరారు.