Arjun Suravaram
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టుపైనే అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. వారికి కౌంటర్ గా వైసీపీ నేతలు సైతం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టుపైనే అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. వారికి కౌంటర్ గా వైసీపీ నేతలు సైతం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు 40 రోజులకుపైగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టుపైనే అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. వారికి కౌంటర్ గా వైసీపీ నేతలు సైతం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి చేయడం కారణాంగానే జైలుక వెళ్లాడని, కోర్టులు కూడా ఆ విషయాన్ని నమ్మే.. బెయిల్ ఇవ్వలేదని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో సామాజిక సాధికార సన్నాహ సమీక్ష సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. నాలుగున్నర ఎనిమిది నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని మంత్రి తెలిపారు. జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు మరింత వివరంగా చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఆయన సూచించారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించినది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అనే వ్యక్తి అధికారం దుర్వినియోగం చేశారని, అధికారులను వాడుకుని అవినీతి చేసినట్లు రుజువైంది కాబట్టి ఆయన బయటకు రావడం లేదన్నారు. నేటికి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, గతంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు కాలం గడిపారని బొత్స తెలిపారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా ఉందా?అంటూ ప్రశ్నించారు. మరి.. చంద్రబాబు అరెస్టు అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.