iDreamPost

చంద్రబాబుకు కొత్త కష్టం..! జర్నలిస్ట్ సాయి కీలక వ్యాఖ్యలు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి జైలు నుంచి ఆదివారం చంద్రబాబు లేఖ విడుదల చేశారు. అయితే ఈ లేఖతో చంద్రబాబుకు మరో కష్టం వచ్చినట్లేనని ప్రముఖ జర్నలిస్ట్ సాయి తెలిపారు. అందుకు గల కారణాలను కూడా సాయి వెల్లడించారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి జైలు నుంచి ఆదివారం చంద్రబాబు లేఖ విడుదల చేశారు. అయితే ఈ లేఖతో చంద్రబాబుకు మరో కష్టం వచ్చినట్లేనని ప్రముఖ జర్నలిస్ట్ సాయి తెలిపారు. అందుకు గల కారణాలను కూడా సాయి వెల్లడించారు.

చంద్రబాబుకు కొత్త కష్టం..! జర్నలిస్ట్ సాయి కీలక వ్యాఖ్యలు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్టుతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. దసరాకు నిజం గెలవాలి పేరుతో మరో కార్యక్రమం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పేరుతో ఓ లేఖ బయటకు వచ్చింది. తాను జైల్లో లేనూ.. ప్రజల గుండెల్లో ఉన్నా… తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు నుంచి ఆదివారం ఆ లేఖ విడుదల చేశారు. అయితే ఈ లేఖతో చంద్రబాబుకు మరో కష్టం వచ్చినట్లే అని ప్రముఖ జర్నలిస్ట్ సాయి తెలిపారు. అందుకు గల కారణాలను కూడా సాయి వెల్లడించారు.

ఆదివారం చంద్రబాబు నాయుడు ఓ బహిరంగ లేఖ రాసిన సంగతి అందరి తెలిసిందే. “నియంత పాలన మీద పోరాటం కొనసాగించండి. మా ఆవిడను జనం వద్దకు వెళ్లమన్నాను. ఆమె కూడా పోరాటానికి సిద్ధమవుతుంది. ఆమె  పోరాటానికి మీరందరూ సహకరించాలి. నేను ఎప్పుడు తప్పు చేయలేదు. తప్పుచేయనివ్వను” అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి చంద్రబాబును ములాఖత్ అయిన తరువాత ఆ పార్టీకి చెందిన నాయకులు ఇలాంటి మాటలే చెప్పే వారు. అందులో తప్పులేదని, అంతేకాక చంద్రబాబు లేఖ రాయడం కూడా తప్పు కాదని సాయి పేర్కొన్నారు. కానీ చంద్రబాబు నాయుడి పేరుతో టీడీపీ ఓ లేఖ  విడుదల చేసిందని, అది నిబంధనలకు విరుద్దంగా విడుదల చేసిందని ఆయన తెలిపారు.

ఇంకా  సాయి మాట్లాడుతూ…” జైల్లో ఉన్న వ్యక్తి లేఖలు రాయోచ్చు. అలా రాసి జైలు అధికారులకు ఇస్తే.. వారు సంబంధిత వ్యక్తులకు ఆ లేఖ ను అందిస్తారు. అలా చంద్రబాబు నిబంధనల ప్రకారం లేఖను విడుదల చేస్తే..దానికి ఓ చట్టబద్దత ఉంటుంది.  అలా కాకుండా టీడీపీ నాయకులే రాసేసి.. బాబు పేరును మాత్రం పెట్టేశారు. అయితే ఆ లెటర్ పై రాజమండ్రి జైలు అధికారులు స్పందించారు. ఈ లేఖ జైలు నుంచి వచ్చింది కాదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ కథ మొత్తం మార్చేసింది. ములాఖత్ కి వెళ్లినప్పుడు ఇలా చెప్పి.. తన పేరు లేఖ విడుదల చేయమని చంద్రబాబు చెప్పాడని టీడీపీ నేతలు తెలిపారు.

ఆ మాట ఏదో లేఖ విడుదల చేసే ముందు చెప్పి ఉంటే బాగుండేది కాదా. చంద్రబాబు నాయుడి సందేశం ఇది అని లేఖ విడుదల చేసి ఉండే సరిపోయేది. ఇలా అతి పబ్లిసిటితో ఈ వివాదం వచ్చింది. రాజకీయ ప్రయోజనం కోసం టీడీపీ లేఖ రాసినప్పుడు. అదే రాజకీయాన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం ఈ లేఖపై స్పందించింది” అని జర్నలిస్ట్ సాయి పేర్కొన్నారు. ఇప్పటికే అరెస్టు, విచారణ, కేసులతో ఉన్న బాబుకు లేఖ రూపంలో మరోకష్టం వచ్చిందంటూ పరోక్షంగా పేర్కొన్నారు. మరి.. సాయి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి