iDreamPost

RTC ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

RTC ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలన అందిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతున్నారు. బడగు, బలహీన వర్గాల వారికి… ఆర్థిక సాయం అందజేస్తూ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకుని వారి మదిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవలే ఏపీ కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగ  ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది.  అలానే ఆర్టీసీ ఉద్యోగల విషయంలో అనేక కీలక నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం తీసుకుంది. తాజాగా ఆర్టీసీ ఉద్యోగల సంక్షేమం దిశగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ(బీమా)ని రూ.45 లక్షల  నుంచి ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ  గురువారం ప్రభుత్వ బ్యాంకులో అతిపెద్దదైన ఎస్ బీఐ తో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత మూడేళ్ల క్రితం రూ.45 లక్షల బీమాని అమలులోకి తెచ్చింది. తాజాగా  ఈ మొత్తాన్ని ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త శాలరీ ప్యాకేజీ 2026 సెప్టెంబరు 2 వరకు అమలో ఉంటుంది. శాలరీ ఒప్పందం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు.

తాజాగా ఒప్పందం ద్వారా  రూ.1.10 కోట్ల ప్రమాదా బీమాతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే.. వారి పిల్లల చదువుల కోసం అబ్బాయిలకు రూ.8 లక్షలు, అమ్మాయిలకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తారు.  అలాగే ఉద్యోగుల పిల్లల వివాహ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని అధికారులు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలు చేయడం పట్ల ఈయూ వర్షం వ్యక్తం చేసింది.  మరి..ఆర్టీసీ ఉద్యోగు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి