Arjun Suravaram
మహాసేన రాజేశ్ ను టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అభ్యర్థిత్వంపై స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మహాసేన రాజేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మహాసేన రాజేశ్ ను టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అభ్యర్థిత్వంపై స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మహాసేన రాజేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Arjun Suravaram
ఏపీ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటుంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా కూడా ఎన్నికలు వచ్చే వరకు పోటీలో ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. అలానే టీడీపీ, జనసేన కూటమి కూడా ఉమ్మడి అభ్యర్థులను తొలి జాబితాను ప్రకటించింది. దీంతో పలువురు నేతలు ఇరుపార్టీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక కూటమి ప్రకటించిన పలువురు అభ్యర్థులపై ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీడీపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవలే టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 118 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ, జనసేన కూటమి ప్రకటించింది. ఇందులో కొన్ని నియోజవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలా వ్యతిరేకత వస్తున్న నియోజవర్గాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పి. గన్నవరం నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ ను ప్రకటించింది. అయితే రాజేశ్ అభ్యర్థిత్వాని స్థానిక టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. బహిరంగంగానే తమ నిరసను తెలియజేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన టీడీపీ, జనసేన కూటమి సమావేశం రసాభాసంగా మారింది. ఏకంగా టీడీపీ నేతల కారు అద్దాలు సైతం ధ్వంసం అయ్యాయి.
సరిపెల్ల రాజేశ్ గతంలో హిందూమతంపై, అగ్రవర్ణాల అమ్మాయిలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాక జనసేనా నాయకులను బండబూతులు తిట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఇలా రాజేశ్ గతంలో చేసిన పలు వివాదస్పద వ్యాఖ్యలు సీటుకే ఎసరు తెచ్చాయని వార్తలు వినిపిస్తోన్నాయి. రాజేశ్ అభ్యర్థిగా తప్పించకుంటే.. తామే ఓడిస్తామని స్థానిక టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు. రాజేశ్ ప్రచారంకి వెళ్లిన ప్రాంతాల్లో కూడా తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై అన్నివర్గాల వారు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఆడపిల్లలను కించపరిచే వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా గెలిపిస్తామంటూ పి.గన్నవరం టీడీపీ,జనసేన నేతలు అంటున్నట్లు టాక్.
ఈ క్రమంలో టీడీపీ అధిష్టానమే రాజేశ్ ను అక్కడి నుంచి తప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి… రాజేశ్.. ఓ ట్వీట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను పి.గన్నవరం నుంచి పోటీ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనలో కూడా తాను చేసిన తప్పులను ప్రస్తావించకుండా.. ప్రభుత్వంపై బురద జల్లె మాటలే రాసుకొచ్చారు. అయితే హిందూమతంపై, అమ్మాయిలపై తాను చేసిన వ్యాఖ్యలే ఈ రోజు చేటు తెచ్చాయని విషయం ఇంకా గ్రహించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి.. పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా రాజేశ్ తప్పుకుంటూ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.