iDreamPost
android-app
ios-app

గుడివాడలో అడుగుపెట్టని లోకేష్! కొడాలి అడ్డాలోకి వెళ్లే ధైర్యం లేదా?

గుడివాడలో అడుగుపెట్టని లోకేష్! కొడాలి అడ్డాలోకి వెళ్లే ధైర్యం లేదా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ  పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. గురువారం 193వ రోజు పాదయాత్ర గన్నవరం నియోజవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో నారా లోకేశ్ మాటలు దాటుతున్నాయి. తమను ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులు ఉన్నతాధికారు పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని,  అధికారంలోకి రాగానే ఒక్కొక్కరి అంతు చూస్తాని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.  రెండు రోజుల క్రితం గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వల్లభనేని వంశీ, కొడాలిని నానిలపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. అలాంటి వీరుడు గుడివాడ నియోజవర్గాని టచ్ చేయకుండా తన పాదయాత్రను ముందుకు సాగించడం అందరిలో ఆశ్చర్యం వేస్తుంది. మరికొందరిలో ఓ అనుమానం చెలరేగింది.

చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ లపై ఒంటి కాలి మీద లేచి వైసీపీ నేతల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరు. ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి తండ్రీకొడుకను ఓ రేంజ్ లో ఆడుకుంటారు. కొడాలి నాని చంద్రబాబు, లోకేశ్ లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంటారు. తండ్రీకొడుకు ఇద్దరూ గుంటనక్కలు అంటూ కూడా సంబోధిస్తారు. ఇంతలా తమ అధినేతపై విరుచుకుపడుతున్న నాని నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర ఓ రేంజ్ లో ఉంటుందని తెలుగు తమ్ముళ్లు ఊహించుకున్నారు. అయితే  గుడివాడను టచ్ చేయుకుండానే గన్నవరం మీదుగా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన పాదయాత్ర గుడివాడలోకి రాకపోవడం పలువురు అనేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గుడివాడను ఆనుకోని ఉన్న గన్నవరంలో లోకేశ్ పాదయాత్ర చేశారు. అంతే తప్ప గుడివాడలో అడుగు పెట్టలేదు. కేవలం దూరం నుంచి మాత్రమే కోడాలి నానికి వార్నింగ్  ఇవ్వడంతోనే  సరిపెట్టుకున్నారు. దగ్గరికి వెళ్తే.. ఏమవుతుందో అనే భయం లోకేశ్ ను భయపెడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ  మాత్రం దానికి ఉత్తర కుమార ప్రగల్భాలు దేనికని మరికొందరు అంటున్నారు. గుడివాడలో పాదయాత్ర చేస్తే నాని అనేదేమీ ఉండదు. కానీ తనను ఏదో చేస్తారన్న భయం లోకేశ్ ను వెనకడుగు వేసేలా  భయపెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.  చంద్రబాబుకు తగ్గట్టే లోకేశ్ కు ధైర్యం లేదని కామెంట్  విపిస్తున్నాయి.

ఇదీ చదవండి: అధికారమంటే పెత్తనం కాదు, ప్రజల పట్ల మమకారం చూపడం: సీఎం జగన్‌