iDreamPost
android-app
ios-app

రుషికొండ నిర్మాణం..లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ!

లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండపై నిర్మాణాలు చేయొద్దన్న పిటిషన్‌ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగమనేని సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశాడు

లింగమనేనికి శివరామ ప్రసాద్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణం విషయంలో ఆయన వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు లో  పిటిషన్ దాఖలు అయింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు శుక్రవారం విచారణకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. అయితే ఈ అంశంలో తమ జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ స్పష్టం చేశారు. లింగమనేని వేసిన పిల్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇది రాజకీయ ఫిర్యాదు అంటూ సీజే డివై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళొద్దని అంటారా? అని సీజే ప్రశ్నించారు. ఏవైనా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. NGT, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రుషికొండ అంశానికి సంబంధించిన కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లింగమనేని సుప్రీంకోర్టుకు పిటీషన్‌ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మసనం కీలక తీర్పు ఇచ్చింది. రుషికొండపై నిర్మాణాలు చేయొద్దన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరి.. లింగమనేని పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.