iDreamPost
android-app
ios-app

Andhra Pradesh: వదిన గొంతు కోసిన మరిది.. ఆ తర్వాత అతడు చేసిన పనికి అందరూ షాక్!

  • Published Jan 31, 2024 | 8:47 AM Updated Updated Jan 31, 2024 | 8:47 AM

వదిన గొంతుకోసి దారుణంగా చంపాడు మరిది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

వదిన గొంతుకోసి దారుణంగా చంపాడు మరిది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

Andhra Pradesh: వదిన గొంతు కోసిన మరిది.. ఆ తర్వాత అతడు చేసిన పనికి అందరూ షాక్!

ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వదిన గొంతు కోసి క్రూరంగా చంపాడు మరిది. ఈ సంఘటన స్థానికంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక ఆమెను చంపిన తర్వాత అతడు చేసిన పనికి అందరూ షాకైయ్యారు. ఇక ఈ సంచలన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారు దుర్గ(36)అనే మహిళ పద్మజా నగర్ లో నివాసం ఉంటోంది. గత ఆరేళ్లుగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమార్తెకు విహహమవ్వగా.. కొడుకు బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇక చిన్న కూతురు చదువుకుంటోంది. దుర్గ రైతు బజారు దగ్గరలోని ఇండోర్ స్టేడియంలో స్వీపర్ గా పనిచేస్తోంది. అయితే తన చెల్లెలి భర్త బి. హరికృష్ణతో ఆమె సన్నిహితంగా మెలిగేది. హరికృష్ణ సైతం నాలుగేళ్లుగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. అతడు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే వీరిద్దరి విషయం తెలియడంతో.. దుర్గ కుమారుడు హరికృష్ణపై దాడి చేశాడు.

It is more than killing one's own

ఇక ఇదే విషయంపై దుర్గ కుటుంబ సభ్యులు తరచుగా గొడవలు పడేవారు. దీంతో ఆమె అతడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఇది సహించని హరికృష్ణ, దుర్గపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి గొంతు కోసి చంపేశాడు. అనంతరం అతడు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్తం కారుతుండగానే రోడ్డుపైకి వచ్చి పడిపోయాడు హరికృష్ణ. ఇది గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో ఉంది దుర్గ. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు వచ్చి వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దుర్గ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.