తాళి కట్టే నిమిషం ముందు ఊహించని ట్విస్ట్.. సినిమా లెవల్లో పోలీసులు ఎంట్రీ

పెళ్లి పీటలపై వధూవరులు కూర్చొని ఉన్నారు. పురోహితుడు వేద మంత్రాలు చదువుతున్నాడు. మరికాసేపట్లో వధువు మెడలో తాళి కట్టేందుకు సిద్ధమౌతున్నాడు వరుడు. అంతలో ఎంట్రీ ఇచ్చారు పోలీసులు.. ఈ పెళ్లి ఆపండి అంటూ.. సినిమా లెవల్లో.

పెళ్లి పీటలపై వధూవరులు కూర్చొని ఉన్నారు. పురోహితుడు వేద మంత్రాలు చదువుతున్నాడు. మరికాసేపట్లో వధువు మెడలో తాళి కట్టేందుకు సిద్ధమౌతున్నాడు వరుడు. అంతలో ఎంట్రీ ఇచ్చారు పోలీసులు.. ఈ పెళ్లి ఆపండి అంటూ.. సినిమా లెవల్లో.

అంగరంగ వైభవంగా ఓ పెళ్లి జరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టాలు ఆ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి పీటలపై వరుడు, వధువు కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. మరి కాసేపట్లో వరుడు తాళి కట్టబోతున్నాడు. పెళ్లి కూతురు తల వంచుకుని సిగ్గుల మొగ్గ అవుతోంది. అంతలో ఈ పెళ్లి ఆపండీ అంటూ ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ఏంటీ సినిమా కథలా ఉందే అనుకుంటున్నారా.. కాదూ.. ఇది రియల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది ఈ ఘటన. వరుడు తనను మోసం చేసి.. మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేయడంతో.. పిలవని పెళ్లికి అతిధులయ్యారు పోలీసులు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

వెల్దుర్తి మండలం రామళ్ల కోటకు చెందిన మహేంద్ర నాయుడికి కర్నూలుకి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. కట్న కానులకులు భారీగా ఇచ్చారు. బ్రహ్మగుండం క్షేత్రంలో ఈ నెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు పెళ్లి ముహుర్తం అనుకున్నారు. పెళ్లి పొద్దున్నే కావడంతో రాత్రికే అక్కడకు చేరుకున్నారు వరుడు కుటుంబ సభ్యులు. పొద్దున్నే పెళ్లి తతంగం ప్రారంభమైంది. మరికాసేపట్లో తాళి కడుతున్నాడనగా.. పోలీసులు ఎంట్రీతో ఆగిపోయింది. వరుడు ఓ అమ్మాయిని మోసం చేశాడని, ఆమె ఫిర్యాదు చేసిందని, వారిద్దరూ దిగిన ఫోటోలు పంపిందని చెప్పడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాధితురాలిది ఉమ్మడి విశాఖ జిల్లా చింతపల్లి వాసి. బాధితురాలు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.

’నాకు గతంలో పెళ్లైంది. పెళ్లైన ఆరు నెలలకే భర్తతో విడిపోయా. మహేంద్ర నాయుడికి నాకు ఇన్ స్టాలో పరిచయం అయ్యింది. అతడు వైజాగ్‌లో పనిచేసేవాడు. ఇద్దరం ఆరేళ్ల పాటు రిలేషన్స్‌లో ఉన్నాం. కొన్ని గొడవలు జరగ్గా.. అతడిని దూరం పెట్టాను. ఆ తర్వాత నిన్నే ప్రేమించా, నువ్వులేకపోతే నేను లేను, నువ్వంటే ప్రాణం, నిన్నే పెళ్లి చేసుకుంటా అని నా ఫ్యామిలీ దగ్గర కూడా చెప్పాడు. నిజమేనని నమ్మాం. నాకు తల్లిదండ్రులు లేరు. నా దగ్గరకు ఈ నెల 19న బయలు దేరతానని చెప్పాడు. కానీ రాలేదు. నాకు డౌట్ వచ్చి.. వేరే వాళ్లను కనుక్కుంటే.. అతడి పెళ్లి అని తెలిసింది. ఏం చేయాలో తోచక వెంటనే 100కి కాల్ చేస్తే,ఇక్కడ పోలీసులు.. కర్నూలు పోలీసులు కాంటాక్ట్ అయ్యి పెళ్లిని ఆపేశారు. ఇప్పుడేమో నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. రీసెంట్లీ మా దగ్గర చుట్టాల్లో పెళ్లి జరిగితే అక్కడకు కూడా వచ్చాడు. ఫ్రూవ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. పలు సార్లు అబార్షన్ కూడా జరిగింది’ అని పేర్కొంది.

Show comments