పానీపూరి అమ్ముతూ.. యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన యువతి!

Komal Priya of Kurnool: కష్టాలు, కన్నీళ్లు పోవాలంటే చదువొక్కటే మార్గం అనుకుందా అమ్మాయి. తన తల్లిదండ్రులకు కష్టాలను తొలగించాలని భావించి.. పట్టుదలతో చదివింది. అంతేకాక అత్యధిక మార్కులు సాధించి...ఉచిత విద్యకు అర్హత సాధించింది. అదే ప్రతిభను యూనివర్శిటీ స్థాయిలో ప్రదర్శించి...ఏకంగా 6 బంగారు పతకాలు సాధించింది.

Komal Priya of Kurnool: కష్టాలు, కన్నీళ్లు పోవాలంటే చదువొక్కటే మార్గం అనుకుందా అమ్మాయి. తన తల్లిదండ్రులకు కష్టాలను తొలగించాలని భావించి.. పట్టుదలతో చదివింది. అంతేకాక అత్యధిక మార్కులు సాధించి...ఉచిత విద్యకు అర్హత సాధించింది. అదే ప్రతిభను యూనివర్శిటీ స్థాయిలో ప్రదర్శించి...ఏకంగా 6 బంగారు పతకాలు సాధించింది.

ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి సర్వసాధారణం. అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిన వారు మాత్రమే జీవితంలో విజేతలుగా నిలబడారు. అలానే విద్యార్థులు విషయంలో కూడా..ఆర్థిక సమస్యలకు భయపడితే..ముందుకు సాగలేరు. వాటికి పరిష్కారం కనుక్కునే దిశగా అడుగులు వేస్తే.. అవే మనకు విజయాన్ని అందిస్తాయి. అచ్చం అలానే ఓ యువతి భావించింది. కష్టాలు, కన్నీళ్లు పోవాలంటే చదువొక్కటే మార్గం అనుకుంది. అమ్మానాన్నలు పడుతున్న కష్టాన్న చూసి..ఆ బాధలు పోవాలని పట్టుదలతో చదివింది. ఆ కసిని యూనివర్శిటీ స్థాయిలో ప్రదర్శించి…ఏకంగా 6 గోల్డ్ మెడల్స్ సాధించింది. మరి.. పానీపూరి అమ్ముతూ.. యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన ఆ  యువతి స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..

కర్నూలు పట్టణంలోని గాయత్రి ఎస్టేట్ ప్రాంతంలో మిట్టా సురేంద్ర, సరస్వతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారు పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఓ కుమార్తె కోమల్ ప్రియా. ఇక ఆడపిల్లలను బాగా చదివిస్తే..వారి కాళ్లపై వాళ్లు నిలబడి జీవిస్తారని సురేంద్ర బలంగా నమ్ముతారు. అందుకే పిల్లల చదువుల విషయంలో ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇదే సమయంలో వారి కుటుంబం బాగా ఆర్థికంగా ఇబ్బందులతో ఉంది. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి.. చదువుల్లో బాగా రాణించాలని కోమల్ ప్రియా భావించింది. అంతేకాక తల్లిదండ్రులకు పానీపూరి తయారీలో  సాయం చేస్తూనే తన చదువులను కొనసాగించింది.

ఈ క్రమంలోనే పదో తరగతిలో అద్భుత ప్రతిభను కనబర్చింది ప్రియా. డాక్టర్ కావాలని కలలు కన్నా…నీట్ లో ఆశించిన ర్యాంకును ప్రియా సాధించలేదు. ఇదే సమయంలో బీఎస్సీ అగ్రికల్చర్ లో ఉచిత సీటు సాధించింది. ఈ క్రమంలోనే  నంద్యాల జిల్లా మహానందిలోని ఆచార్య ఎన్జీ రంగా కళాశాలో చేరింది. అక్కడే నిర్వహించే ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెలక్ట్ అయింది.  తన కుటుంబ పరిస్థితి చూసే..బాగా చదవాలనే కసి తనలో పెరిగిందని, కోమల్ ప్రియా తెలిపారు. నిరంతరం తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుని, ఆ కష్టాలు తొలగించాలనే భావించినట్లు తెలిపింది. అలా చదువుపై కసి పెంచుకుని కష్టపడి చదివింది. విశ్వవిద్యాలయ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా ఆరు బంగారు పతకాలు గెలిచింది.

ఇక ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షలు రాయగ..జాతీయ స్థాయిలో  27వ ర్యాంకును ప్రియా సాధించింది. ఆ ర్యాంకుతో ఢిల్లీలో ఇండియన్ అగ్రికల్చర్ ఇన్ స్ట్యిట్యూట్ లో సీటు సాధించింది. రెండేళ్లలో కీటక శాస్త్ర విభాగంలో ఎమ్మెస్సీ చేసింది. ఇటీవలే పీహెచ్ డీ పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురు చూస్తుంది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే చదువుల్లో రాణిస్తుంది కోమల్ ప్రియా. చదువు కోసం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే వర్సిటీ స్థాయిలో 6 గోల్డ్ మెడల్స్ సాధించింది రికార్డు సృష్టించింది. తల్లిదండ్రులు లక్షల డబ్బులు ఖర్చు చేసినా కొందరు విద్యార్థులు చదువులో రాణించడం లేదు. కానీ తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకుని, ఆర్థిక సమస్యలకు భయపడక..ధైర్యంగా ఎదుర్కొంటూ..చదువుల్లో విజేతగా నిలిచి.. అందరికీ ఆదర్శంగా నిలిచింది ప్రియా. భవిష్యత్ లో ఉన్నత చదువులు చదివి..దేశాభివృద్ధికి తోడ్పడతానని ప్రియా చెబుతుంది. మరి.. యువతి సక్సెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments