తనకు క్యాన్సర్ ఉందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన కొడాలి నాని!

తనకు క్యాన్సర్ ఉందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన కొడాలి నాని!

కొడాలి నాని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆయనకు క్యాన్సర్ ఉందంటూ రెండ్రోజుల నుంచి వార్తలు.. సోషల్ మీడియాలో హడావుడి జరుగుతోంది. ఒక పార్టీ సోషల్ మీడియాలో పోస్టులను ఆధారంగా చేసుకుని వార్తా సంస్థలు ఈ వార్తలు రాసినట్లు తెలుస్తిం. అయితే అందరికీ షాకిస్తూ కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. అసలు తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని అది కేవలం తప్పుడు ప్రాచారం అంటూ ఖండించారు.

కొడాలి నానికి అనారోగ్యం, క్యాన్సర్ అనే వార్తలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయి. దాంతో అటు వైసీపీ వర్గాల్లో మాత్రమే కాకుండా.. కొడాలి నాని అభిమానుల్లో కూడా ఆందోళన నెలకొంది. కొడాలి నానికి ఏమైంది అంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలపై స్వయంగా కొడాలి నానినే స్పందించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని.. అవన్నీ పుకార్లు అంటూ క్లారిటీ ఇచ్చారు. కొందరు కావాలనే అలాంటి వార్తలను పుట్టించినట్లు కామెంట్ చేశారు.

పుకార్లపై స్పందిస్తూ.. “నాకు ఎలాంటి క్యాన్సర్ లేదు. నేను బాగానే ఉన్నాను. అవి కేవలం ఐటీడీపీ పేజెస్ వచ్చిన పుకార్లు మాత్రమే. వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని ఛానల్స్ వార్తలు రాశాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. చంద్రబాబును రాజకీయాల నుంచి ఇంటికి పంపే వరకు నేను ఈ భూమ్మీదే ఉంటాను. వాళ్లు అలాంటి పుకార్లు ప్రచారం చేయడం వల్ల నాకు పోయేది ఏమీ లేదు. చంద్రబాబుని ఇంటికి పంపే వరకు నేను రాజకీయాల్లోనే ఉంటా” అంటూ కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

మరోవైపు కొడాలి నానిపై జరుగుతున్న ప్రచారాలపై గుడివాడి వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి పుకార్లతో ఆయనను మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాకుండా.. శాటిలైట్ లో కూడా ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ జయంతి రోజున కొడాలి నాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జులై 9న అడపా బాబ్జి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండాలమ్మ అమ్మవారికి సారెను కూడా సమర్పించారు” అంటూ గుడివాడ వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొడాలి నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Show comments