iDreamPost
android-app
ios-app

బాబును ఒక రేంజ్ లో ఆడుకుంటున్న కేశినేని నాని!

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకపడుతున్న వారిలో ఆయన ఒకరు. అవకాశం దొరికిన ప్రతిసారి బాబుపై మాటల దాడి చేస్తున్నారు. అలానే ఇటీవల కూడా కేశినేని నాని.. బాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకపడుతున్న వారిలో ఆయన ఒకరు. అవకాశం దొరికిన ప్రతిసారి బాబుపై మాటల దాడి చేస్తున్నారు. అలానే ఇటీవల కూడా కేశినేని నాని.. బాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

బాబును ఒక రేంజ్ లో ఆడుకుంటున్న కేశినేని నాని!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ బాగా పెరిగింది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం..కురుక్షేత్ర సమరాన్ని మించి ఉంది. ఇరు పార్టీలు భారీ బహిరంగ సభలతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. ఇలా ఇరు పార్టీల అధినేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటే..మరోవైపు స్థానిక నేతలు కూడా మాటలతో అదే స్థాయిలో ఉన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొందరు నేతలు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. వారిలో ముందు వరుసలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. కేశినేని నాని మాటలకు బాబు ఏడుపు ఒక్కటే తక్కువ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన మూడు ఎంపీ స్థానాల్లో విజయవాడ ఒకటి. ఇక్కడి నుంచి కేశినేని నాని విజయం సాధించారు. ఆయన వరుసగా రెండో సారి విజయవాడ నుంచి గెలుపొందారు. అలా కేవలం ఆయన గెలుపొందడమే కాకుండా ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే  అభ్యర్థుల విజయానికి కూడా ఎంతో కీలకంగా వ్యవహరించారు. అయితే ఇటీవలే చంద్రబాబు.. కేశినేని నాని పొమ్మనకుండా పొగపెట్టారు. అత్యంత అవమానకరమైన రీతిలో, పార్టీ సభకు హాజరు కావద్దని సందేశం పంపడం ద్వారా కేశినేని నానిని పరోక్షంగా బయటకు వెళ్లమని చెప్పారు. దీంతో మనస్సు కలత చెందిన ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఈసారి కూడా విజయవాడ పార్లమెంట్ బరిలో ఉండబోతున్నారు.

ఇక తనను అవమానకర రీతిలో బయటకు పంపినా చంద్రబాబుపై కేశినేని నాని ఓ రేంజ్ లో విరుచకపడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని దగ్గర నుంచి చూసిన వ్యక్తి కావడంతో ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ తన తమ్ముడు చిన్ని మీద కంటే.. చంద్రబాబు, నారా లోకేశ్ లపై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఓ సమావేశంలో కేశినేని నాని మరోసారి చంద్రబాబును ఓ రేంజ్ లో ఆడుకున్నారు. చంద్రబాబుకు ఆయన రాజధాని అని చెప్పుకునే ప్రాంతంలో ఇప్పటి దాకా సొంత ఇల్లు కూడా లేదని నాని తెలిపారు.

నిజం చెప్పాలంటే ఆయనకు సొంత ఇళ్లు ఏర్పాటు చేసుకునే ఉద్దేశం కూడా లేదని నాని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఓటమి పాలవుతానని ఆయన ముందే గ్రహించారని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం ఎంత మాత్రమూ లేదని.. అమాయకంగా ఆ పార్టీ నుంచి టికెట్ల కోసం ఆరాట పడే వారికి టికెట్లు నమ్ముకుని డబ్బు పోగు చేసుకునే ఉద్దేశంతో బాబు ఉన్నారని కేశినేని నాని చెబుతున్నారు.

అలా పార్టీ టికెట్లు అమ్మకోవడం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను తీసుకొని హైదరాబాద్ కి వెళ్తారని నాని  పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి మొత్తం మూటాముల్లే ఖాళీ చేసి తెలంగాణ వెళ్లిపోతారని ఆయన చెబుతున్నారు.  ఇక కేశినేని నాని చెప్పిన మాటలే నిజమైతే.. పవన్ కల్యాణ్ లాంటి వారు నిర్మించుకుంటున్న రాజకీయ ఆశల సౌధాలన్నీ పేక మేడల్లాగా కూలిపోక తప్పదేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మొత్తంగా చంద్రబాబును కేశినేని నాని అవకాశం దొరికిన ప్రతి సారి ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. మరి.. బాబుపై కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.