Arjun Suravaram
K V Ushashri Charan: రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి కె.వి. ఉషశ్రీ చరణ్ పెనుగొండ నియోజవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పెనుగొండలో విసృత్తంగా పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా టీడీపీపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
K V Ushashri Charan: రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి కె.వి. ఉషశ్రీ చరణ్ పెనుగొండ నియోజవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పెనుగొండలో విసృత్తంగా పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా టీడీపీపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ మంటలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన కూటమిపై వైసీపీ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచకపడుతున్నారు. ముఖ్యంగా రా..కదలిరా సభపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి ఉష శ్రీ చరణ్ చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం పెనుకొండ నియోజకవర్గంలోనే పర్యటించారు. ఈ సందర్భంగా పరిగి మండలంలో టీడీపీ నుంచి 430 కుటుంబాలు మంత్రి ఉషశ్రీ చరణ్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రా కదలిరా సభ టీడీపీకీ ఇదే ఆఖరి సభ అని అన్నారు. టీడీపీ నిర్వహిస్తున్న సభలకు జనం రావడం లేదని, రా కదలి రా..అంటే పారిపోతున్నారని ఆమె తెలిపారు. రెండు రోజుల ముందు వరకు వాలంటీర్లను చంద్రబాబు కించపరిచారని ఆమె మండి పడ్డారు. పెనుగొండ సభలో నిర్వహించిన వాలంటీర్లను కొనసాగిస్తామంటూ టీడీపీకి పని చేయడంటూ చంద్రబాబు అడుకున్నారు. ఇది చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని మంత్రి ఉషా శ్రీ చరణ్ తెలిపారు.
అనంతపురం జిల్లాలో రాప్తాడు లో జరిగిన సిద్ధం సభలో పార్కింగ్ స్థలంలో సగం కూడా చంద్రబాబు రా..కదలిరా సభ జరిగిందని ఆమె తెలిపారు. సిద్ధం సభ ఓ సముద్రం అయితే.. టీడీపీ నిర్వహిస్తున్న రా కదలిరా సభలు పిల్ల కాలువంటూ ఆమె సెటైర్లు వేశారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ దుర్మర్గా పాలన చేశారని ఆమె తెలిపారు. ఇక పెనుగొండ నియోజకవర్గం నుంచి తనకు భారీ ఎత్తున స్పందన వస్తుందని, ప్రతి ఊరులో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అందరు కలిసి కూడా జగన్ అజెండాను తీసుకెళ్తున్నామని, మళ్లీ జగన్ నే సీఎం అని ఆమె పేర్కొన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని మంత్రి ఉషాశ్రీ చరణ్ ధీమ వ్యక్తం చేశారు. ఇటీవలే మంత్రి ఉషా శ్రీ చరణ్ ను కళ్యాణ దుర్గం నుంచి పెనుగొండకు సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం మార్చిన సంగతి తెలిసిందే. ఆమె 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో శిశు, సంక్షేమ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనను కొత్తగా నియమించిన పెనుగొండ నియోజకవర్గంలో విసృత్తంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో టీడీపీపై మంత్రి ఉషశ్రీ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి.. టీడీపీపై, చంద్రబాబుపై ఉషాశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.