iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో చంద్రబాబు, పవన్ ఒకే స్కూల్: జర్నలిస్ట్ సాయి

ముఖ్యంగా ఇటీవల అవనిగడ్డలో ఆయన చేసిన ప్రసంగం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం ఆయన ఎన్డీఏలో ఉంటూ.. అవనిగడ్డ ప్రసంగంలో మాత్రం కేవలం టీడీపీ, జనసేన పేర్లను మాత్రమే ప్రస్తావించారు.

ముఖ్యంగా ఇటీవల అవనిగడ్డలో ఆయన చేసిన ప్రసంగం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం ఆయన ఎన్డీఏలో ఉంటూ.. అవనిగడ్డ ప్రసంగంలో మాత్రం కేవలం టీడీపీ, జనసేన పేర్లను మాత్రమే ప్రస్తావించారు.

ఆ విషయంలో చంద్రబాబు, పవన్ ఒకే స్కూల్: జర్నలిస్ట్ సాయి

ఏపీలో రాజకీయలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా  అధికార, విపక్షాల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ చిత్రవిచిత్రంగా ఉందని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ముఖ్యంగా ఇటీవల అవనిగడ్డలో ఆయన చేసిన ప్రసంగం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం ఆయన ఎన్డీఏలో ఉంటూ.. అవనిగడ్డ ప్రసంగంలో మాత్రం కేవలం టీడీపీ, జనసేన పేర్లను మాత్రమే ప్రస్తావించారు. ఇక పవన్ కల్యాణ్ ప్రసంగం, ఆయన తీసుకుంటున్న పొలిటికల్ నిర్ణయాలు చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే స్కూల్ అని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. సీనియర్ జర్నలిస్ట్ సాయి పవన్ కల్యాణ్ పొలిటికల్ తీరుపై కీలక విషయాలను తెలిపారు.

మిత్రపక్షాలను చిన్నచూపు చూడటంలో బీజేపీ బాధితురాలు అయితే తెలుగు దేశం పార్టీ బాటలోనే జనసేన నడుస్తోందని ఆయన తెలిపారు. మిత్రపక్షాలను కాలుకింద తేలులా చూడటం, నా చెప్పు చేతల్లో ఉండాలని  అనుకోవడం చంద్రబాబు నైజమని, కమ్యూనిస్టు, బీజేపీ లు ఆ విధంగానే నాశనం అయ్యాయని సాయి పేర్కొన్నారు. “సొంతగా ఎదిగిన పార్టీలు చంద్రబాబుతో కలిశాక.. ఆ పార్టీలోని ప్రధాన వ్యక్తులను ఆయన ఆకర్షిస్తాడు. సదరు పార్టీల వ్యక్తులను చంద్రబాబు తన వెంట  తిప్పుకుంటారు. తద్వారా ఆ వ్యక్తులు.. బాబు అంటే వీరాభిమానాలుగా మారిపోతారు. ఏస్థాయిలో ఉంటారంటే తమ పార్టీ పోతేమి.. బాబు చూసుకుంటారులే అనేంతలా వారు మారిపోతారు. చంద్రబాబు నమ్మిన వారిని వాడుకొని ఎలా వదిలేస్తారు అనడానికి కొందరు వ్యక్తులే నిదర్శనం.

చంద్రబాబు పొత్తు వద్దు అనుకున్నప్పుడు  ఓ కారణం చెప్పకుండా బయటకు వచ్చేస్తారు. ఆ విధంగానే ఏ కారణం చెప్పకుండా NDA,నేషనల్ ఫ్రంట్ నుంచి బయటకు వచ్చారు. బీజేపీని తొక్కడంలో సుదీర్ఘం లక్షణం కలిగిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు బాబు స్కూల్ లోనే పవన్ కల్యాణ్ చేరారు. 2014 బీజేపీ తో మద్దతు అన్నారు. 2018 బీజేపీతో విభేదించారు. అలానే 2024 కూడా మరోసారి బీజేపీని టీడీపీ జనసేనలు దెబ్బకొట్టనున్నాయి. ఎందకంటే..2020లో నుంచి బీజేపీని వదిలేసి  ఉంటే.. సొంతంగా వాళ్లే బలపడేవారు. అందుకు నిదర్శనం ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ నిలబడిన విధానం. బీజేపీని ఎదగనివ్వకుండా చంద్రబాబు ఎలా తొక్కేశారో, అదే స్కూల్ పవన్  ఉన్నార” అని జర్నలిస్ట్ సాయి తెలిపారు. మరి.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.