Arjun Suravaram
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య టిడ్కో ఇళ్ల విషయంలో తరచూ మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా టిడ్కో ఇళ్ల విషయంలో నాడు చంద్రబాబు చేసిన తప్పు..నేడు ప్రజలను వెంటాడుతోందని ప్రముఖ జర్నలిస్ట్ సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య టిడ్కో ఇళ్ల విషయంలో తరచూ మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా టిడ్కో ఇళ్ల విషయంలో నాడు చంద్రబాబు చేసిన తప్పు..నేడు ప్రజలను వెంటాడుతోందని ప్రముఖ జర్నలిస్ట్ సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు లేకున్నా.. అదే వాతావరణం కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అధికార వైసీపీ పై ప్రతిపక్ష టీడీపీ పలు అంశాలపై విమర్శలు గుప్పిస్తుంది. అయితే ఈ అధికార, ప్రతిపక్షాల మధ్య వివిధ విషయాలపై ఓ రేంజ్ లో పరస్పర ఆరోపణలు జరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి టిడ్కో ఇళ్ల అంశం. ఇదే అంశంపై తరచూ ఇరుపార్టీల మధ్య వాదనలు నడుస్తుంటాయి. అయితే తాజాగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రముఖ జర్నలిస్ట్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు. టిడ్కో ఇళ్ల విషయంలో నాడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు నేడు ప్రజలను వెంటాడుతుందన్నారు. అందుకు గల కారణాలను కూడా వివరించారు.
టిడ్కో ఇళ్ల విషయంలోచంద్రబాబు నాయుడు చేసిన తప్పు నేడు వెంటాడుతోందన్నారు. ఇప్పుడు డబ్బులు కట్టమని ప్రజలకు నోటీసులు వస్తున్నాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ..”సాధారణంగా ప్రభుత్వం కట్టించే ఇళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటుంది. పేదలకు కట్టించే ఇళ్ల విషయంలో కేంద్రం సగం డబ్బు సాయం చేస్తుంది, స్థలం మౌళిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుతం జగనన్న ఇళ్లకింద రూ.35 వేలు ప్రజలకు ఇప్పించి.. అవి వారినే కట్టుకోమన్నారు. అయితే టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల విషయంలో ఒక్కొక్కరి పేరుపై రూ.3 లక్ష తీసుకున్నట్లు వారి చేత సంతకాలు చేయించారు. అయితే ఇక్కడ టిడ్కో ఇళ్లు పూర్తి కాలేదు. అయితే ఆ డబ్బులు ఏమైనట్లు, వాటిని దేనికి ఖర్చు చేశారు. టిడ్కో ఇళ్లను నిర్మించే కాంట్రాక్టర్ కి అప్పుడే ఇచ్చేసి ఉంటే కట్టిస్తాడు, కానీ ఇవ్వలేదు.
టిడ్కో ఇళ్లు అవిగో అయిపోయాయి ఇవిగో అయిపోయాయి అంటూ ఏళ్లు పాటు కాలం గడిపారు. దాదాపు 20 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి పేద ప్రజలకు ఇచ్చి ఉంటే..వారందరు జీవితకాలం చంద్రబాబును గుర్తుంచుకునే వారు కదా. అంతేకాక టీడీపీ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చివరదశలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి కూడా ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డికి పేరు వస్తుందని వాటిని పూర్తి చేయలేదు. పూర్తి చేసిన ఇళ్లు ప్రజలకు మంజూరు చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిపై టిడ్కొ ఇళ్ల పాపం అంత ఆయన మీద తోసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం టిడ్కో ఇళ్లు చేతి అందకుండానే డబ్బులు కట్టమంటూ వందల మంది ప్రజలకు నోటీసులు వస్తున్నాయి. నాడు చంద్రబాబు చేసిన తప్పు నేడు ప్రజలను వెంటాడుతోంది” అని సాయి తెలిపారు. మరి.. టిడ్కో ఇళ్ల అంశంలో చంద్రబాబుపై జర్నలిస్ట్ సాయి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.