Arjun Suravaram
పీలో ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అయినా ఇక్కడ పొలిటికల్ హీట్ సమ్మర్ ను మించి పోయి ఉంది. ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలీలో ప్రచారంలో దూసుకెళ్తూన్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తన పంతా మార్చుకుని ముందుకెళ్తున్నారు.
పీలో ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అయినా ఇక్కడ పొలిటికల్ హీట్ సమ్మర్ ను మించి పోయి ఉంది. ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలీలో ప్రచారంలో దూసుకెళ్తూన్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తన పంతా మార్చుకుని ముందుకెళ్తున్నారు.
Arjun Suravaram
రాజకీయల్లో ఎంతో మంది కొత్త కొత్త ఎన్నికల ప్రచారాలు చేస్తుంటారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ ప్రచారాన్ని సాగిస్తుంటారు. అంతేకాక మరికొందరు అయితే కొత్తగా ఎన్నికల ప్రచారం చేస్తూ రాజకీయాల్లో ట్రెండ్ సృష్టిస్తుంటారు. అలాంటి వారిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒకరు. ఆయన పరిపాలన విధానం దగ్గర నుంచి రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలు, ప్రచారాల వరకు అని కొత్తగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. దేశంలోని పలువురు రాజకీయ నేతలు సీఎం జగన్ రాజకీయ శైలీని ఫాలో అవుతున్నారు. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సరికొత్త ప్రచారానికి తెర తీశారు.
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అయినా ఇక్కడ పొలిటికల్ హీట్ సమ్మర్ ను మించి పోయి ఉంది. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూకుడు చూపితుంది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విభిన్న తరహాలో చేస్తూ తన మార్క్ చూపిస్తారు. అంతేకాక సీఎం జగన్ చేసే ఎన్నికల ప్రచారం అందరిని ఆకట్టుకుంటుంది.
2019ఎన్నికల సమయంలో.. ప్రచారంలో వైఎస్ జగన్ తన మార్క్ చూపించారు. జగన్ కు సంబంధించిన స్లోగన్స్ ను వైసీపీ నేతలు ప్రజల్లోకి విస్తృత్తంగా తీసుకెళ్లారు. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం ముందు ‘బైబై బాబు..’ అంటూ కౌంట్‌డౌన్ క్లాక్ ఏర్పాటు చేశారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ సీపీ ఆఫీసుల వద్ద కూడా ఈ క్లాక్ లు దర్శనం ఇచ్చాయి. ఇంకా చెప్పాలంటే కౌంట్ డౌన్ క్లాక్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఆ నేపథ్యంలోనే 2019 ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన విజయాన్ని అందించారు. తాజాగా ఈ సారి ఎన్నిక ప్రచారంలో కూడా అదే తరహా ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టుంది.
అయితే ఆ ప్రచారంలో మాత్రం తన పంతాను మార్చింది. గతంలో 151 సీట్లలో విజయంతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ.. ఇప్పుడు వైనాట్ 175 పేరుతో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అలానే ‘వైనాట్ కుప్పం’ అంటూ సీఎం జగన్ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నీ బిడ్డ ప్రభుత్వంలో మీకు మంచి చేకూరింది.. లబ్ధి జరిగితేనే ఓటు వేయాలని కోరుతున్నారు సీఎం జగన్. ఇదేసమయంలో.. 2019లో ‘బై బై బాబు’ పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్ ఏర్పాటు చేసినట్టుగానే.. ఈసారి కూడా మరో 73 రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ”జగన్ అనే నేను” పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్‌లు ఏర్పాటు చేసింది వైఎస్సార్ సీపీ.
ఈ కొత్త కౌంట్‌డౌన్ క్లాక్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌తో పాటు ఇతర నేతలు ఈ కౌంట్‌డౌన్ క్లాక్ బోర్డును ఆవిష్కరించారు. ఆ క్లాక్ ప్రకారం.. మరో 73 రోజుల్లో వైఎస్సార్ సీపీ తిరిగి అధికారం చేపడుతుందనే విధంగా క్లాక్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇక, ‘జగన్ అనే నేను..’ కౌంట్ డౌన్ క్లాక్ తో మరోసారి ఏపీ సీఎం గా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని పరోక్షంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ ప్రత్యేకంగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ జగన్ అనే నేను పేరుతో ఉన్న కౌంట్ డౌన్ క్లాక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.