ISRO SSLV D3 EOS 8 Launched Successfully: ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ ప్రయోగం విజయవంతం. దీని ఉపయోగాలు ఏంటంటే?

ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ ప్రయోగం విజయవంతం. దీని ఉపయోగాలు ఏంటంటే?

ISRO SSLV D3 EOS 8 Launched Successfully: శ్రీహరికోట నుంచి వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతాన్ని సృష్టించింది. ఈ ఉదయం నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ దూసుకు వెళ్లింది.

ISRO SSLV D3 EOS 8 Launched Successfully: శ్రీహరికోట నుంచి వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతాన్ని సృష్టించింది. ఈ ఉదయం నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ దూసుకు వెళ్లింది.

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మనిషి ఎన్నో అద్బుతమైన ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నాడు. ప్రాణాలు పోయిన మనిషికి తిరిగి జీవం పోయడం తప్ప అన్నింటా తన మార్క్ ఏంటో చూపించుకుంటున్నాడు. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా తన ఆదిపత్యాన్ని చాటుకుంటున్నాడు. అంతరిక్షంలోకి రాకెట్స్ పంపించి అద్బుతాలు సృష్టించాడు. నింగిలో మానవాలి మనుగడ ఏదైనా ఉందా అన్న పరిశోధనలు చేస్తున్నాడు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుంది. ఇటీవల చంద్రయాన్ 3 ప్రయోగం యావత్ ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేశారు శాస్త్రవేత్తలు. తాజాగా ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ నింగిలోకి దిగ్విజయంగా ప్రయోగించారు. దీని ప్రత్యేకతలు, ఉపయోగాలు ఏంటో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తిరుపతి జిల్లా శ్రీహరి కోటల షార్ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 రాకెట్ ని విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్ – 08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టామని.. ఈ విజయం ఇక్కడ ప్రతి ఒక్కరి సొంతం ని ఇస్రో చేర్మన్ సోమనాథ్ అన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం 17 నిమిషాలపాటు కొనసాగింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ ని సరిగ్గా శుక్రవారం (ఆగస్టు 16) ఉదయం 9:17 గంటలకు ఈవోఎస్-08 భూ పరిశీలన శాటిలైట్ ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

ఇస్రో ఎస్ఎస్ఎల్వీ డీ3 ఉపయోగా: ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వాతలు, పర్యావరణ పరిస్థితులను ఈవోఎస్-08 పర్యవేక్షిస్తుంది. ప్రకృతి విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో ఈవోఎస్ ను అభివృద్ది చేశారు. ఇందులో ఎలక్టరో ఆప్టికల్స్ ఇన్ ఫ్రారెడ్ పే లోడ్ మిడ్ – వేవ్, లాంగ్ వేవ్ ఇన్ ఫ్రా-రెడ్ లో ఫోటోలను క్యాప్చర్ చేసి పంపుతుంది. కాగా, ఎస్ఎస్ఎల్వీ డి3 ఈవోఎస్ 8 మిషన్ లో ఇది మూడవది.. చివరి ప్రయోగం. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందంతో ఉప్పొంగిపోయారు.. కేరింతలు, చప్పట్లో కొడుతు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఏడాది కాలం సేవలు అందించేలా రూపకల్పన చేశారు.

Show comments