iDreamPost
android-app
ios-app

చంద్రబాబు భయపడ్డారా? దెబ్బతో లెక్క మారింది!

చంద్రబాబు భయపడ్డారా? దెబ్బతో లెక్క మారింది!

“ఏం పిచ్చి పిచ్చిగా ఉందా?, తమషాలు చేస్తున్నారా?, మీ అంతు చూస్తా?, అవినితీ చేసిన ఎవర్ని వదిలి పెట్టను, అందరిని జైలుకి పంపిస్తా”.. ఈ మాటలు ఎప్పుడూ చంద్రబాబు నోటి నుంచి వినిపిస్తుంటాయి. అయితే గత కొంతకాలం నుంచి చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి భయపడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా చంద్రబాబు ఎదుటి వారిని దబాయిస్తూ మాట్లాడ్డం అనేక సార్లు చూశాం. అయితే  తాజాగా నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేసే సమయంలో అధికారులతో ప్రవర్తించిన తీరు  అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఆత్మరక్షణలో పడ్డరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సహజంగా చంద్రబాబు ఎదుటి వారిపై దబాయిస్తూ మాట్లాడుతుంటారు. పోలీస్ అధికారులపై విరుచుక పడుతుంటారు. తనపై చేయి వేస్తే ఖబడ్దార్ అంటూ, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, తన జోలికి వస్తే.. వారిని చట్టపరంగా శిక్షిస్తాని బెదిరిస్తూ ఉంటారు. ఇలా ఎంతో గాంభీర్యంగా, దబాయించి మాట్లాడే చంద్రబాబు నాయుడు నంద్యలలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించారు. నంద్యాలలో చంద్రబాబు నాయుడు ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద బస చేశారు. శుక్రవారం రాత్రి ఆయన వద్దకు వెళ్లిన సీఐడీ అధికారులు అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు.

చంద్రబాబు బస కేంద్ర వద్దకు డీఐజీ రఘరామిరెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘవీర్ రెడ్డి వెళ్లి.. అరెస్ట్ చేసేందుకు వచ్చామని బాబుకు వివరించారు. అయితే ఇక్కడే బాబు ప్రవర్తనలో మార్పు కనిపించింది. ఎప్పుడు దబాయించే మాట్లాడే ఆయన వారితో ఎలాంటి వాదనకు దిగకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది చంద్రబాబు సహజత్వానికి విరుద్దమని కొందరు అభిప్రాయపడుతున్నారు.  తనపై  వచ్చిన నేరారోపణలు ఏంటో చెప్పాలని అధికారులను వినయంగా చంద్రబాబు అడగడం గమన్హారం. ఇక్కడ చంద్రబాబు కంటే.. ఎక్కువగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధికారులతో మాట్లాడారు. చంద్రబాబు ఉండి కూడా లేనట్లుగా.. కూర్చీలో కూర్చుని ఉండిపోయారు.

అంతేకాక చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకెళ్లే సందర్భంలో ఆయన ముఖంలో చాలా నిరాశతో కనిపిస్తోంది.  ఇంతకాలం తనను ఏమీ చేయలేరని ఆయన అనుకుని ఉండొచ్చని, అందుకు విరుద్దంగా అరెస్ట్ చేయడంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారని పలువురు అభిప్రాయా పడుతున్నారు. చంద్రబాబును సుదీర్ఘకాలం గమనించిన వారు.. తాజా పరిణామాలు చూసి.. ఆయన భయపడ్డారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి.. నిజంగానే ఏపీ ప్రభుత్వం దెబ్బకు చంద్రబాబు భయపడ్డారా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి