Rains: ఏపీ, తెలంగాణకు వాతావారణ శాఖ అలెర్ట్.. ఈ జిల్లాల 5 రోజులు భారీ వర్షాలు!

Heavy Rains in Telangana and Andhra Pradesh: ఈ ఏడాది ఎండలు ఏ రేంజ్‌లో దంచికొట్టాయో.. వర్షాలు కూడా అదే స్థాయిలో పడుతున్నాయి. జులై మాసం నుంచి వాతావరణంలో పూర్తిగా మార్పులు సంభవించి భారీగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

Heavy Rains in Telangana and Andhra Pradesh: ఈ ఏడాది ఎండలు ఏ రేంజ్‌లో దంచికొట్టాయో.. వర్షాలు కూడా అదే స్థాయిలో పడుతున్నాయి. జులై మాసం నుంచి వాతావరణంలో పూర్తిగా మార్పులు సంభవించి భారీగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ కేంద్రం మరో కీలక అప్డేట్ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ- బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్నారు. బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ ప్రాంతమంతా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్ల అలర్ట్ జారీ చేసింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచింది. వివరాల్లోకి వెళితే..

ఈ నెల మొదటి వారం నుంచి ఏపీ, తెంగాణలో ఒకటి.. రెండు రోజులు మినహాయించి వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఉదయం విపరీతమైన ఎండలు.. సాయంత్రం కాగానే వర్షం పడుతుంది. మంగళవారం మూడు గంటల పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తెలంగాణలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాలు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నిర్మల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లో వర్ష ప్రభావాన్ని బట్టి స్కూళ్లకు సెలవుల విషయంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పార్వతీపురం, విజయనగరం, ఉభయగోదావరి, ఏలూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే  మత్స్యకారులు  పరిస్థితిని బట్టి వేటకు వెళ్లాలని సూచించింది.  అత్యవసర పరిస్థితులు ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు.

Show comments