iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు!

  • Published Nov 21, 2023 | 9:50 AM Updated Updated Nov 21, 2023 | 9:50 AM

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించాయి. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించాయి. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. సముద్ర మట్టం వద్ద ఏర్పడిన ద్రోణి ప్రభావం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు ఉత్రర కోస్తాలో తెలిపికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయిన తెలిపారు. తమిళనాడు తీరానికి ఆనుకొని ఉన్న నైరుతీ బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి దాదాపు 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం ఇక్కడ కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలోనే ఉత్తర కోస్తా, యానాంలో కూడా తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. నేడు ఉత్తర కోస్తా లో తెలిక పాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతామని అంటున్నారు. ఈ నెల 22 న తేలికపాటి నుంచి మోస్తరు.. లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంటున్నారు. దక్షిణ కోస్త లో కూడా నేడు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని జిల్లాలో అయితే భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తుంది. రాయలసీమలో కూడా తేలిక పాటి వర్షాలు, జల్లులు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. నేడు కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పట్నాడు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు వర్షాలు పడుతున్న కారణంగా జాగ్రత్తలు వహించాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపిలో రెయిన్ అలర్ట్ జారీ చేశారు.

ఇక తెలంగాణలో సైతం వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ కీలక ప్రకటన చేసింది. రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి అది భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ హైదరాబాద్ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వాతావరణంలో పలు మార్పులు సంభవించనున్నాయి. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు రైతులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. భారీగానే పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.