నేటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Hyderabad Rain Weather Forecast: గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎక్కడిక్కడ జలాశయాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Hyderabad Rain Weather Forecast: గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎక్కడిక్కడ జలాశయాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ నెల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. ఒకటీ రెండు రోజులు తప్ప ప్రతిరోజూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేటి నుంచి ఐదు రోజుల వరకు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇటీవల కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం మంగళవారం హైదరాబాద్ లో కురిసిన వర్షానికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు కోలుకోలేదు. తాజాగా ఏపీ, తెలంగాణాకు వాతావరణశాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఏపీ, తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు,కాల్వలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపోయేలా కనిపించడం లేదు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇరు రాష్ట్రాలకు వర్షాలపై మరో కీలక సూచన చేసింది. పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ద్రోణి, యాక్టీవ్ గా ఉన్న నైరుతి రుతుపవనాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు (ఆగస్టు 26) నుంచి నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఆదిలాబాద్, కోమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, గద్వాల, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూల్, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలం వరకు అలలు అతి వేగంగా వస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లవొద్దని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు అధికారులు.

Show comments