iDreamPost
android-app
ios-app

అల్పపీడన ఎఫ్టెక్.. రేపు ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు!

IMD Alert for AP and Telangana: భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రేపు ఆగష్టు 30వ తేదీన దేశంలోని వివిధ రాష్ట్రాలో మోస్తారు నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

IMD Alert for AP and Telangana: భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రేపు ఆగష్టు 30వ తేదీన దేశంలోని వివిధ రాష్ట్రాలో మోస్తారు నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అల్పపీడన ఎఫ్టెక్.. రేపు ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా గుజరాత్ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అంతేకాక భారీగా ఆర్థిక నష్టం చోటుచేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా భారత వాతావరణ శాఖ కీలక అలెర్ట్ జారీ చేసింది. రేపు అనగా శుక్రవారం ఆగష్టు 30వ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఐంఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

రేపు దేశ వ్యాప్తంగా అతి భారీ వానలు కురవనున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కారణంగా భారీ వానలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, ఒడిశా, కర్నాటక, కేరళ,  చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలో వానలు పడనున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్‌, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

rain alert

పలు రాష్ట్రాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవొద్దని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రానికి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తూ ఉండాలని గ్రేటర్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. అలానే ఏపీలోని వివిధ ప్రాంతాల్లో రేపు మోస్తారు నుంచి అతి భారీ వానలు కురవనున్నాయి. మొత్తంగా రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.