Dharani
IMD-Pressure Effect To AP, Tg: వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పిందని తెలిపింది. కానీ మరో మూడు రోజుల్లోనే మరో ముప్పు వాటిల్లనుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
IMD-Pressure Effect To AP, Tg: వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పిందని తెలిపింది. కానీ మరో మూడు రోజుల్లోనే మరో ముప్పు వాటిల్లనుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వానల కారణంగా తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వరదల వల్ల ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ప్రధాన హైవేల మీద రాకపోకలు నిషేధించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం బలహీనపడుతుందని తెలిపింది. కానీ మరో మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణకు మరో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆ వివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం.. క్రమంగా బలహీనపడుతోందని తెలిపింది వాతావరణ కేంద్రం. తూర్పు విదర్భ-రామగుండం దగ్గర కేంద్రీకృతమైన వాయుగుండం.. రాగల 12 గంటల్లో పూర్తిగా బలహీన పడనున్నట్టు పేర్కొంది. అయినప్పటికీ.. తెలంగాణలో నేడు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అంతేకాక నేటి నుంచి మరో 4 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శఆఖ అంచనా వేసింది. అలానే ఇవాల కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో.. తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇవాళ కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. అలానే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీ, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మూడు రోజుల్లో మరో ముప్పు ముంచుకురానుందని తెలిపింది. అంటే సెప్టెంబర్ 5 నాటికి పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి తెలంగాణ మీదుగా ఈ ఉపరితల ద్రోణి కొనసాగనుందని అధికారులు వివరించారు. కోస్తాంధ్ర తీరానికి అతి చేరువలో ఏర్పడే అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది.