iDreamPost
android-app
ios-app

బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

  • Published Sep 12, 2023 | 10:18 AM Updated Updated Sep 12, 2023 | 10:18 AM
  • Published Sep 12, 2023 | 10:18 AMUpdated Sep 12, 2023 | 10:18 AM
బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంలో రాగల ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో 72 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పడవొచ్చని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు. దాని ప్రభావంతో ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కంటిన్యూగా కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ప్రస్తుతం మయన్మార్ తీరానికి ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావం రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుంది. ఇక రాబోయే ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రంల్లో మోస్తారు వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ, బాపట్ల, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. అల్లూరి, ఏలూరు, పార్వతీపురం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆఱ్, కోనసీమ, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంతో పరిస్థితుల వల్ల సముద్రంలో అల్లకల్లోంగా ఉందని.. సముద్ర తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంటున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచన ఉందని మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక శుక్రవారం నుంచి శనివారం వరకు కుమ్రంభీమ్, నిర్మల్, నిజామాబాద్, జిగిత్యాల, రాజన్న సిరిసిల్లు, ములుగు, జయశంకర్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.