Dharani
IMD Alert Heavy Rains In AP, TG: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
IMD Alert Heavy Rains In AP, TG: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
Dharani
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఇక నిన్నంతా వాన, ముసురు. ఇక కుండపోత వానతో భాగ్యనగరం తడిసి ముద్దై పోయింది. భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వరద సంభవించింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వాహనాలతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయారు. ఇక భారీ వర్షాల కారణంగా నిన్న పాఠశాలలకు హాలీడే ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక అలర్ట్ జారీ చేశారు. మరో వారం రోజులు పాటు.. ఏపీ, తెలంగాణలో జోరు వానలు కురుస్తాయని.. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారత వాతావరణ శాఖ కొత్త బులిటెన్ ప్రకారం.. అరేబియా సముద్రం నుంచి కర్ణాటక, దక్షిణం వైపున ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 21 అనగా బుధవారం నుంచి వారం పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం వేళ పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే బుధవారం సాయంత్రం 3 తర్వాత నుంచి హైదరాబాద్, కోస్తా, ఉత్తరాంధ్రలో వర్షాలు మొదలవుతాయని అంటున్నారు
నేడు అనగా బుధవారం నాడు హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అలానే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. కోస్తా ప్రాంతంలో జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు జోరు వానలు దంచి కొడుతున్నా.. మరోవైపు ఉక్కపోతతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇక తెలంగాణలో పగటివేళ ఉష్ణోగ్రత గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. గాలి లేని కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అలానే తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు అనగా ఆగస్ట్ 20-24వ తేది వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.