iDreamPost
android-app
ios-app

I-PAC: CM జగన్ కోసం పనిచేస్తాం.. ఐ-పాక్ కీలక ప్రకటన!

  • Published Dec 24, 2023 | 12:39 PM Updated Updated Dec 24, 2023 | 12:39 PM

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు తమ గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు తమ గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు.

  • Published Dec 24, 2023 | 12:39 PMUpdated Dec 24, 2023 | 12:39 PM
I-PAC: CM జగన్ కోసం పనిచేస్తాం.. ఐ-పాక్ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు సొంతం చేసుకునేందుకు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అధికార ప్రభుత్వం తమ నాయకులను రంగంలోకి దింపింది. తాజాగా ఐ-పాక్ సంచలన ప్రటన చేసింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు నెలకొంటున్నాయి. ఏపీలో 2024 లో జరగబోయే ఎన్నికల కోసం అన్నిపార్టీల నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ శనివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరీ భేటీ కావడంతో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. వీరి భేటీ అనంతరం ఐ-పాక్ కీలక ప్రకటన చేసింది. 2024 ఎన్నికల్లో తాము వైఎస్ జగన్ కి పూర్తి మద్దతు ఇస్తామని ట్విట్టర్ (ఎక్స్) వేధికగా ప్రకటించింది.

‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం అనుక్షణం ఎంతో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కు మా వంతు సహాయం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సాఆర్ సీపీ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాం. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపు కోసం పనిచేస్తాం’ అంటూ ట్విట్టర్ లో స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. ఆ ఎన్నికల్లో ఐపాడ్ సంస్థ తరుపునుంచి వ్యూహాత్మకంగా పనిచేశారు. తర్వాత బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం టీఎంసీ గెలుపుకోసం వ్యూహకర్తగా వ్యవహరించారు. కొన్ని పరిణామాల తర్వాత ప్రశాంత్ కిషోర్.. ఐ-పాక్ నుంచి బయటకు వచ్చారు. తాజాగా సీఎం జగన్ గెలుపు కోసం ఐ-పాక్ పనిచేస్తామని ప్రకటించడంపై సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.