iDreamPost
android-app
ios-app

తిరుమల శ్రీవారికి భారీ విరాళమిచ్చిన హైదరాబాదీ కుటుంబం.. ఎంతంటే?

  • Published Jun 01, 2024 | 10:52 AM Updated Updated Jun 01, 2024 | 10:52 AM

భక్తుల పాలిట కొంగుబంగారమై, కోరిన కోర్కెలు తీర్చే శ్రీవారి దర్శన భాగ్యం కొరకు భక్తులు ఆరాటపడుతుంటారు. కానుకలు, విరాళాలు సమర్పించుకుంటుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారికి భారీ విరాళమందించారు హైదరాబాదీ కుటుంబం.

భక్తుల పాలిట కొంగుబంగారమై, కోరిన కోర్కెలు తీర్చే శ్రీవారి దర్శన భాగ్యం కొరకు భక్తులు ఆరాటపడుతుంటారు. కానుకలు, విరాళాలు సమర్పించుకుంటుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారికి భారీ విరాళమందించారు హైదరాబాదీ కుటుంబం.

తిరుమల శ్రీవారికి భారీ విరాళమిచ్చిన హైదరాబాదీ కుటుంబం.. ఎంతంటే?

కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల చేత పూజలందుకుంటున్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. తమ కష్టాలను కడతేర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని భక్తులు శ్రీవారిని వేడుకుంటారు. తమ కోర్కెలను తీర్చే శ్రీ వేంకటేశ్వర స్వామికి కానుకలు, విరాళాలు సమర్పించుకుంటుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం శ్రీవారికి భారీ విరాళమందిచింది. టీటీడీకి ఏకంగా కోటిన్నర రూపాయలను విరాళంగా అందించింది.

వ్యాపారంలో కలిసొచ్చిన వారు, ఉన్నత ఉద్యోగాలు పొందిన వారు శ్రీవారికి కానుకలు విరాళాలు సమర్పించుకుంటుంటారు. గతంలో భక్తులు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయలను తిరుమల శ్రీవారికి విరాళంగా ఇస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందించింది హైదరాబాదీ కుటుంబం. హైదరాబాద్‌కు చెందిన వివేక్ కైలాస్, విక్రమ్ కైలాస్ అనే భక్తులు రూ.1.5 కోట్లను ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు. తమ కంపెనీ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డీడీ తీసి.. డీడీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అనంతరం విరాళం సమర్పించిన వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీవెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి ఈ ట్రస్టు ద్వారా ఫ్రీగా వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. కిడ్నీ, గుండె , బ్రెయిన్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స చాలా ఖరీదుతో కూడుకున్నది. నిరుపేదలకు ఈ వైద్యచికిత్సలను భరించడం చాలా కష్టం కావటంతో శ్రీవెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ద్వారా వారికి ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.