nagidream
Hundreds Of Crows Came To Save One Crow At Chicken Shop In Ambedkar Konaseema District: తోటి మనిషిని చూసి నేర్చుకో అనే పరిస్థితి నుంచి కాకులని చూసి నేర్చుకో.. చీమలని చూసి నేర్చుకో అనే రోజులు వచ్చాయా అంటే అవుననే అనిపిస్తుంది. నడిరోడ్డు మీద ఒక మనిషిని చంపుతుంటే చూస్తూ వీడియోలు తీసే జనం ఉన్న ఈ సమాజంలో ఒక కాకికి మనిషి వల్ల ఆపదొస్తే అదే మనిషితో పోరాడి ఆ కాకిని రక్షించుకున్న కాకులు ఉన్నాయని మీకు తెలుసా?
Hundreds Of Crows Came To Save One Crow At Chicken Shop In Ambedkar Konaseema District: తోటి మనిషిని చూసి నేర్చుకో అనే పరిస్థితి నుంచి కాకులని చూసి నేర్చుకో.. చీమలని చూసి నేర్చుకో అనే రోజులు వచ్చాయా అంటే అవుననే అనిపిస్తుంది. నడిరోడ్డు మీద ఒక మనిషిని చంపుతుంటే చూస్తూ వీడియోలు తీసే జనం ఉన్న ఈ సమాజంలో ఒక కాకికి మనిషి వల్ల ఆపదొస్తే అదే మనిషితో పోరాడి ఆ కాకిని రక్షించుకున్న కాకులు ఉన్నాయని మీకు తెలుసా?
nagidream
సాధారణంగా నువ్వు మనిషివా? పశువ్వా? అని అంటారు. అంటే పశువులతో పోలిస్తే మనుషులు చాలా మేలు అని అర్థం. అంటే మనిషిని చూసి మిగతా జంతువులు ఎలా బతకాలో నేర్చుకోవాలి అన్నట్టు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనుషులు జంతువుల్లా.. జంతువులు మనుషుల్లా ప్రవర్తనలో మార్పు వచ్చిందనే చెప్పాలి. నడిరోడ్డు మీద మనిషి ఆపదలో ఉంటే తోటి మనిషి వీడియో తీసి వైరల్ చేయాలని చూస్తారే కానీ ఆ నేరాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయరు. కానీ ఇక్కడ ఒక కాకి ఆపదలో చిక్కుకుందని వందల కాకులు అక్కడే ఉండి ఆ కాకిని రక్షించాయి. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది.
చిన్నప్పుడు చదువుకున్న కాకి పాఠం గుర్తుండే ఉంటుంది. కుండలో రాళ్లు వేసి అడుగున ఉన్న నీళ్లను పైకి తెచ్చుకుని మరీ తన దాహం తీర్చుకుంటుంది. దానికి ఆ సమయస్ఫూర్తి, ఓర్పు, పట్టుదల ఉన్నాయి కాబట్టే కాకికి అంత పేరు వచ్చింది. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తాటిపాక డైలీ మార్కెట్లో ఓ చికెన్ షాప్ యజమాని.. ఆ షాప్ దగ్గరకు కాకి వచ్చి అరుస్తూ విసిగిస్తుందని తాడుతో కట్టేసాడు. కాకిని బంధించడంతో మిగతా కాకులు వందలాదిగా ఆ షాప్ దగ్గరకు చేరుకొని అరవడం మొదలుపెట్టాయి. కాకుల గొలను భరించలేక అక్కడున్న మిగతా షాపుల యజమానులు ఇబ్బందులు పడ్డారు. దీంతో చేసేదేం లేక ఆ చికెన్ షాప్ యజమాని కట్లు విప్పి కాకిని వదిలేశాడు. కాకులన్నీ అక్కడ నుంచి వెళ్లిపోయాయి.
దీనికి సంబంధించి వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తిని నడిరోడ్డు మీద చంపుతుంటే వీడియో తీస్తారే తప్ప ఆపుదామన్న ఇంగిత జ్ఞానం ఉండదు. ఐకమత్యం అంటే ఈ కాకులది. ఈ కాకులని చూసి నేర్చుకోవాలి.. ఈ యూనిటీ మనుషుల్లో ఉంటే ఈ సమాజం ఎప్పుడో బాగుపడేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే మరి.. చీమలని చూసి క్రమశిక్షణ, కాకులను చూసి ఐకమత్యం నేర్చుకునే పరిస్థితికి మనిషి దిగజారిపోవడం బాధాకరమే. ఆపరా నీ కాకి గోల అంటూ ఉంటారు. కాకి గోల అంటే ఇదేనేమో.. ఆ కాకి గోల వెనుక ఇంత పట్టుదల ఉందన్న మాట. మొత్తానికి ఈ కాకులు తోటి మనుషుల పట్ల మిగతా మనుషులు ఎలా ఉండాలో నేర్పించాయి. కాకి నేర్పిన పాఠం ఇది. మరి ఒక కాకి కోసం వందలాది కాకులు నిరసన చేపట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
కాకి అరిచి విసిగిస్తుందని తాడుతో కట్టేసిన ఓ చికెన్ షాప్ యజమాని
అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి విసిగిస్తుందని దాన్ని ఓ చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు.. అయితే కాకిని బంధించడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకుని అరవడం మొదలెట్టాయి.
కాకుల గోలను… pic.twitter.com/08GzAC94px
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2024