Arjun Suravaram
YSRCP Siddam Meeting: 'సిద్ధం' పేరుతో వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారాన్ని పూరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమిలీలో ఈ సభ జరగ్గా.. తాజాగా దెందులూరులో కూడా సిద్ధం సభకు రెడీ అయ్యారు.
YSRCP Siddam Meeting: 'సిద్ధం' పేరుతో వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారాన్ని పూరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమిలీలో ఈ సభ జరగ్గా.. తాజాగా దెందులూరులో కూడా సిద్ధం సభకు రెడీ అయ్యారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఇరుపార్టీలూ ఉన్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్సార్ సీపీ చాలా దూకుడుగా ఉంది. ఇప్పటికే నియోజవర్గాల ఇన్ ఛార్జీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవలే భీమిలిలో సిద్ధం సభలో వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారభించారు. తొలి సభతోనే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తేలా సీఎం జగన్ స్పీచ్ అదరగొట్టారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ‘సిద్ధం’ సభ జరుగుతోంది. ఈ సభలో జన జాతరను తలపిస్తోంది.
జన జాతరకు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమైంది. సార్వత్రిగా ఎన్నికలకు సంబంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులకు సిద్ధం సభా వేదికగా శనివారం సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు వైఎస్సాసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇక ఈ సభ కోసం ఏలూరు ఆటోనగర్-దెందులూరు సమీపంలో సహారా గ్రౌండ్స్ లో 110 ఎకరాల ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం ముస్తాబు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. సభా వేదిక నిర్మాణం, వేదిక ముందు భాగంలో ఫ్యాన్ గుర్తులో వాకింగ్ ఏర్పాటు చేశారు. ఏలూరు సిద్ధం సభకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. దాదాపు 4 లక్షల మంది ఈ సభకు హాజరవుతున్నట్లు పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలంతా మేము సిద్ధంగా ఉన్నామని సభకు వస్తున్నారు.