ఏపీకి పొంచి ఉన్న వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచికొట్టనున్నాయి. వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతున్నది.

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచికొట్టనున్నాయి. వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతున్నది.

వానాకాలం సీజన్ ముగిసినా వర్షాలు మాత్రం వదలడం లేదు. అల్పపీడనాలు, వాయుగుండం, తుఫాన్ ప్రభావాలతో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఇప్పుడంతా పంట చేతికొచ్చే సమయం కాబట్టి రైతన్నలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆరుగాళం కష్టపడి పండించిన పంట నీటి పాలవుతుందన్న బెంగ ఎక్కువైపోతున్నది. అకాల వర్షాలతో తీరని నష్టం జరుగుతున్నది. ఓ వైపు చలి చంపేస్తుంటే మరో వైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చలి వణుకు పుట్టిస్తుంటే.. వర్షాలు భయపెడుతున్నాయి. వానదేవుడా కరుణించయ్యా అని వేడుకుంటున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలతో ఏపీ అతలాకుతలం అయిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా ప్రజలు నిలువ నీడ లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోయింది. ఇప్పుడు మరోసారి ఏపీకి వానగండం పొంచి ఉన్నది. ఏపీపై వరుణుడు మరోసారి విరుచుకు పడేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఏపీలో వర్షాలపై విశాఖ వాతావరణ కేంద్రం కీలక అప్ డేట్ అందించింది. కుండపోత వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరకోస్తాలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 28, 29 తేదీన ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, శ్రీకాకుళం,విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అలర్జ్ జారీ చేసింది. వాయుగుండం నేపథ్యంలో తీర ప్రాంతాల్లో 35 నుంచి 55కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.

వర్షాలు కురవనున్న నేపథ్యంలో మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఇప్పటికే కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీకి వాన ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఏపీలో మరోసారి వర్షాలు కురవనుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments