చరిత్ర సృష్టించబోతున్న AP వ్యక్తి.. అంతరిక్షంలోకి తొలి తెలుగు కుర్రాడు..

అంతరిక్షయాత్రకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఎంపికయ్యారు. అంతరిక్షానికి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నారు. అతను మరెవరో కాదు తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర.

అంతరిక్షయాత్రకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఎంపికయ్యారు. అంతరిక్షానికి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నారు. అతను మరెవరో కాదు తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర.

స్పేస్ రీసెర్చ్ కోసం ఇస్రో, నాసా వంటి సంస్థలు అంరిక్షయాత్రలకు ప్లాన్ చేస్తున్నాయి. విశ్వం గుట్టును విప్పేందుకు అనేక పరిశోధనలకు శ్రీకారం చుడుతున్నాయి. గతేడాది ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగించి విజయం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. కాగా అంతరక్షయాత్రకు ఓ తెలుగు కుర్రాడు వెళ్లనున్నాడు. అంతరిక్షానికి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోయే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన వ్యక్తి కావడం తెలుగు ప్రజలకు మరింత గర్వకారణం. అతను మరెవరో కాదు తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర.

విజయవాడలో పుట్టిపెరిగిన గోపీచంద్ తోటకూర అమెరికాలో నివాసముంటున్నారు. ఈయన అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. ఎన్‌ఎస్‌-25 మిషన్‌ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్‌ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్‌ తోటకూర ఒకరు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్‌ మిషన్‌ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది.

ఎన్‌ఎస్‌-25 మిషన్‌కు గోపీచంద్‌ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్‌ క్యాపిలిస్ట్‌ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్‌ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్‌ షాలర్‌, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్‌ ఎడ్‌ డ్వైట్‌ ఎన్‌ఎస్‌-25లో ప్రయాణించనున్నారు. అయితే ఇదివరకు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్‌ తోటకూర మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్‌పోర్టే ఉంది.

తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర:

విజయవాడలో జన్మించిన గోపీచంద్‌ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్‌ జెట్‌ పైలట్‌గా పని చేశారు. బుష్‌ ప్లేన్లు, ఏరోబాటిక్‌ ప్లేన్లు, సీప్లేన్లు, హాట్‌ ఎయిర్‌ బెలూన్లకు కూడా పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్‌ లైఫ్‌ కార్ప్‌ అనే ఒక వెల్‌నెస్‌ సెంటర్‌కు గోపీచంద్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

Show comments