Vinay Kola
Heavy Rains: వర్షా కాలం కావడంతో ఎక్కడ చూసినా కూడా తీవ్ర వర్షం కురుస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పట్టణాలు, నగరాల్లో వర్షపు నీరు నిలిచిపోతుంది.
Heavy Rains: వర్షా కాలం కావడంతో ఎక్కడ చూసినా కూడా తీవ్ర వర్షం కురుస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పట్టణాలు, నగరాల్లో వర్షపు నీరు నిలిచిపోతుంది.
Vinay Kola
వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షా కాలం కావడంతో ఎక్కడ చూసినా కూడా తీవ్ర వర్ష పాతం నమోదవుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వాయుగుండం కారణంగా అసలు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పట్టణాలు, పెద్ద పెద్ద నగరాల్లో అయితే వర్షపు నీరు నిలిచిపోతుంది. ఆగని వానల వల్ల రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఎటు చూసినా కూడా ఉప్పొంగిన సముద్రంలా నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నిలిచిపోతున్న నీళ్ల కారణంగా జనాలు బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. చాలా ఊళ్ళల్లో ఈ వానలకు పంటలు మునిగిపోతున్నాయి. రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. వాన నీరు నదుల్లా పారడం వలన నగరాల్లో ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు.
వానలతో పాటు బలమైన గాలులు కూడా వేగంగా వీస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ పిడుగులు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చెరువులు, నదులు వర్షపు నీటితో నిండిపోయాయి. వరదలా పారుతూ రోడ్ల పైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవ్వరు బయటకి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు ఆగకుండా కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రెండు జిల్లాల వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కృష్ణ, గుంటూరు జిల్లాలో వాన తగ్గుముఖం పట్టనుందని తెలిపింది. వాయుగుండం బలహీనపడుతుంది. విశాఖకు 90 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతం అయ్యింది. దీంతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తతో కృష్ణ, గుంటూరు వాసులకు ఊరట కలిగింది.