Arjun Suravaram
2024లో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్నారు. అందులో భాగంగా ఇటీవల రెండు ఉమ్మడి సమావేశాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
2024లో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్నారు. అందులో భాగంగా ఇటీవల రెండు ఉమ్మడి సమావేశాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Arjun Suravaram
        
ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. 2024లో జరగనున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే భవిష్యత్ కార్యచరణ కోసం రెండు పార్టీలు ఉమ్మడి సమావేశాలను నిర్వహిస్తున్నాయి. అంతేకాక ఇటీవలే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిపెస్టోను విడుదల చేశారు. దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వీరి మినీ మేనిఫెస్టో పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంత జనరంజకంగా, ఆకర్షణీయంగా లేదని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ, జనసేన పార్టీలు, ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీల్లో జనసేన నుంచి ముత్తా శశిధర్, వరప్రసాద్, శరత్ కుమార్ ఉండగా.. టీడీపీ నుంచి యనమల రామకృష్ణ, పట్టాబి, అశోక్ బాబు ఉన్నారు. ఈ కమిటీ మంగళవారం జరిపిన భేటీలో కీలకమైన కొన్ని అంశాల్ని చర్చించింది. ఈ సమావేశంలో జనసేన 5, టీడీపీ 6 అంశాలను ప్రతిపాదించగా.. కమిటీలో చర్చించి..తుది నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 11 అంశాలతో తొలిదశ మేనిఫెస్టో సమావేశం జరిగింది.
అయితే ఈ మినీ మేనిఫెస్టోపై పలువురు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టోపై మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య స్పందించారు. మినీ మేనిఫెస్టో అంత జనరంజకంగా, ఆకర్షణీయంగా లేదని ఆయన అన్నారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో హరిరామ జోగయ్య ఒక ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్ధిష్టమైన అంశాలు లేవని ఆయన తెలిపారు. ప్రధాన మేనిఫెస్టో అయినా కనీసం 4 కోట్ల జనాభా సంతృప్తి పడేలా ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రకటనలో తెలిపారు. అలా కానీ పక్షంలో వైఎస్సాఆర్ సీపీని ఢీకొట్టడం మీ వల్ల కాదని టీడీపీ, జనసేనను ఉద్దేశించి తెలిపారు.
వైఎస్సార్‌సీపీ అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఢీకొట్టాలంటే ఉమ్మడి మేనిఫెస్టోలో మార్పులు చేయాలని సూచించారు. ఇరుపార్టీల అధినేతలకు శ్రేయోభిలాషిగా సలహా ఇస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నట్టుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటి వరకు జనసేనకు, పవన్ కల్యాణ్ కు మద్దతుగా మాట్లాడుతూ వచ్చిన హరిరామ జోగయ్య.. ఇప్పుడు ఉమ్మడి మేనిఫస్టోపై అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి.. టీడీపీ, జనసేన ప్రకటించిన మనీ మేనిఫెస్టో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.