iDreamPost
android-app
ios-app

నేడు APలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నది. శాసన సభలో మంత్రి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేడు (బుధవారం) ఉదయం 11:02 గం.లకు శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం 2024-25కి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేడు (బుధవారం) ఉదయం 11:02 గం.లకు శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో సచివాలయంలోని మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ అమోదం తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం సభ ఆమోదం తెలపనున్నది.

కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) ఓటాన్‌ అకౌంట్‌ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను చదివి వినిపించనున్నారు. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వేళ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఆమోధయోగ్యమైన కేటాయింపులు చేస్తుందని, పలు వర్గాలపై వరాల జల్లు కురిపించబోతున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.